గతంలో ఓ ప్రొఫెషన్ కి సంబంధించిన వారసులు అదే ప్రొఫెషన్ లో కొనసాగేందుకు ఇంట్రెస్ట్ చూపించేవారు. ఇప్పుడు ట్రెండ్ మారిపోయి అందరూ హీరోలు, హీరోయిన్లు అయిపోతున్నారు. మహేష్ భట్ వంటి పెద్ద దర్శకుడి కూతురైనా.. పెద్ద హీరోయిన్ గా ఎదుగుతున్న ఆలియా భట్. అయితే తండ్రి అడుగుజాడల్లో మరి ఒక్క సినిమాకైనా దర్శకత్వం వహిస్తుందా? ఆల్రెడీ ఈమె అక్కయ్య పూజా భట్ (మహేష్ ఫస్ట్ వైఫ్ కూతురు) హీరోయిన్ గా చేసి.. తరువాత డైరక్టర్ కూడా అయ్యింది. ఇప్పుడు ఒక మసాలా వెబ్ సిరీస్ ఒకటి తీస్తోంది.
''సినిమాల్లో నటించేటప్పుడు మా నాన్నను కానీ కుటుంబంలో వేరే వారిని కానీ ఎలాంటి సలహాలు అడగలేదు. నటన విషయంలో ఇంటి నుంచి సలహా సూచనలు తీసుకోలేదు. ఆ సినిమా డైరెక్టర్ చెప్పినది చేస్తానంతే. రేపు డైరెక్షన్ చేయాలన్నా కూడా ఇలాగే చేయాలి. కానీ దర్శకత్వం అంటే మాటలు కాదు. అన్ని విషయాలను డైరెక్టర్ దగ్గరుండి చూసుకోవాలి. నేను ఎప్పటికీ అలా చేయలేనేమో అనిపిస్తుంది. అందుకే అటువైపు వెళ్లను'' అని చెప్పింది ఆలియా భట్. అయితే.. డైరెక్షన్ వైపు వెళ్లకపోయినా.. ప్రొడక్షన్ విభాగంలోకి మాత్రం వస్తుందట. ఏదో ఒకరోజు నిర్మాతగా మారి సినిమాలు నిర్మిస్తా అంటోందీ భామ.
హీరోయిన్ గా ఫామ్ లో ఉన్నప్పుడు ఎవరు మాత్రం డైరక్షన్ చేస్తా అంటారులే. సినిమాలు లేనప్పుడేగా సైడ్ ట్రాక్ పట్టేది.