సినీ ఇండస్ట్రీలో నెపోటిజం - ఫేవరిజమ్ - వారసత్వం అనే మాటలు ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి. అయితే ఇటీవల ఆత్మహత్య చేసుకొని మరణించిన బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ వ్యవహారంతో ఈ అంశంపై ఎప్పుడూ లేనంతగా చర్చ జరుగుతోంది. బాలీవుడ్ లో స్టార్ కిడ్స్.. వాళ్లను నడిపించే సినీ ప్రముఖులు ఒక మాఫియాలా తయారై రియల్ టాలెంట్ ను తొక్కేస్తున్నారని.. ఈ క్రమంలోనే సుశాంత్ ఆత్మహత్యకు పాల్పడాల్సి వచ్చిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కరణ్ జోహార్, సల్మాన్ ఖాన్, ఆలియా భట్, మహేష్ భట్, సోనమ్ కపూర్, కరీనా కపూర్ వంటి బాలీవుడ్ ప్రముఖులపై సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఈ క్రమంలో వారి నుండి వచ్చే చిత్రాలను బాయ్ కాట్ చేయాలని నెటిజన్స్ కామెంట్స్ చేస్తూ వస్తున్నారు.
ఈ నేపథ్యంలో అలియా భట్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'సడక్ 2' సినిమా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో విడుదల చేయనున్నట్లు అధికారికంగా అనౌన్స్ చేసారు. ఇక ఆ చిత్ర నిర్మాత అలియా భట్ తండ్రి మహేష్ భట్ సోషల్ మీడియాలో ఈ చిత్ర పోస్టర్ ను విడుదల చేశాడు. దీనికి నెటిజన్ల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. కాగా సుశాంత్ కుటుంబ సభ్యులు బాలీవుడ్ చిత్రాల్లో ఎంతవరకు నెపోటిజమ్ ఉందన్న విషయాన్ని గుర్తించేందుకు 'నెపోమీటర్' ను ప్రారంభించారు. దీనికోసం సోషల్ మీడియాలో 'నెపోమీటర్' అనే పేరుతో అకౌంట్ కూడా క్రియేట్ చేశారు. నెపోమీటర్ అనేది సినిమాకి సంబంధించి ఐదు కేటగిరీలను ప్రధానంగా పరిగణనలోకి తీసుకుంటుంది. డైరెక్టర్ - ప్రొడ్యూసర్ - లీడ్ యాక్టర్స్ - సపోర్టింగ్ రోల్స్ - రైటర్ ఆధారంగా సినిమాలో ఎంతమేరకు నెపోటిజం ఉందనే విషయాన్ని తెలియజేస్తూ ఫలితాన్ని వెల్లడిస్తుంది.
కాగా నెపోమీటర్ ఎక్కువ శాతాన్ని చూపిస్తే అది అందులో సినీ ప్రముఖుల కుటుంబ సభ్యులు అధికంగా ఉన్నట్లు.. తక్కువగా చూపిస్తే ఎలాంటి బ్యాగ్రౌండ్ లేని వారు ఆ సినిమాలో ఎక్కువగా ఉన్నట్లు అర్థం. ఇక నెపోమీటర్ అలియా భట్ 'సడక్ 2' చిత్రం 98% నెపోటిస్టిక్ అని తెలిపింది. అంటే ఈ చిత్రంలో నెపోమీటర్ లోని ఐదు కేటగిరీలలో నాలుగింటిలో బాలీవుడ్ ప్రముఖుల వారసులే ఉన్నారని స్పష్టం చేసింది. బాలీవుడ్ లో నెపోటిజమ్ రూపుమాపాలన్న ప్రయత్నంతోనే దీన్ని ప్రవేశపెట్టామని.. బయట నుంచి వచ్చేవారికి అవకాశాలు ఇవ్వని వారి సినిమాలు సినీ అభిమానులను చూడవద్దని 'నెపోమీటర్' క్రియేట్ చేసిన వారు పేర్కొన్నారు. నెపోమీటర్ ఎక్కువగా ఉందంటే అది బాయ్ కాట్ చేయాల్సిన సమయం. మీరు అలాంటి సినిమా చూస్తారా? లేదా అని కామెంట్ చేయండి అని ఇంస్టాగ్రామ్ లో వెల్లడించారు.