గర్భవతి అయినా కూడా ఆమెనే నెం.1

Update: 2022-09-15 02:30 GMT
సోషల్‌ మీడియాలో రెగ్యులర్‌ ట్రెండ్స్ ను పరిగణలోకి తీసుకుని ఓర్మాక్స్ మీడియా సంస్థ ప్రతి నెలలో కూడా జాబితా విడుదల చేస్తుంది. తాజాగా ఆగస్టు నెలలో మోస్ట్‌ పాపులర్ సెలబ్రెటీలు ఎవరు.. ఎవరి గురించి సోషల్‌ మీడియాలో అధికంగా చర్చ జరిగింది అనే విషయాన్ని సదరు మీడియా సంస్థ వెళ్లడించి జాబితాను విడుదల చేయడం జరిగింది.

బాలీవుడ్ హీరోయిన్స్ లో నెం.1 గా ఆలియా భట్‌ నిలిచింది. ఆగస్టు నెలలో ఆలియా భట్ గురించి ప్రముఖంగా చర్చ జరిగింది. కారణం ఆమె గర్భవతి అవ్వడం తో పాటు ఆమె నటించిన బ్రహ్మాస్త్ర సినిమా విడుదల నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహించారు. ఆ కారణంగా ఆలియా భట్ గురించి ట్విట్టర్ తో పాటు ఇతర సోషల్‌ మీడియా ప్లాట్‌ ఫామ్స్ పై ప్రముఖంగా చర్చ జరిగింది.

ఆలియా నెం.1 గా నిలవడంతో రెండవ స్థానంలో దీపికా పదుకొనే నిలిచింది. ఆమె భర్త రణ్వీర్ సింగ్ న్యూడ్‌ ఫోటోలు ఆ మధ్య తెగ వైరల్‌ అయ్యాయి. వాటి గురించిన చర్చ వచ్చిన ప్రతి సారి కూడా దీపికా పదుకొనే గురించిన ప్రస్తావన వచ్చింది. అందుకే నెం.2 స్థానంలో దీపికా పదుకొనే నిలిచింది. ఇక ఇటీవలే పెళ్లి చేసుకుని భర్తతో హనీమూన్ మూడ్‌ లో ఉన్న కత్రీనా కైఫ్ కూడా ఈ మధ్య కాలంలో ఏదో ఒక టాపిక్ తో సోషల్‌ మీడియాలో ఉంటూ వచ్చింది.

పెళ్లి ఇతర విషయాల గురించి ప్రముఖంగా చర్చ జరగడం వల్ల కత్రీనా కైఫ్‌ నెం. 3 స్థానంలో నిలిచింది. ఆ తర్వాత స్థానాల్లో కియారా అద్వానీ మరియు కృతి సనన్ లు ఉన్నారు. వీరికి నాలుగు ఐదు స్థానాలు దక్కాయి. ఇక ఆరవ స్థానంలో సీనియర్‌ బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్ కరీనా కపూర్‌ ఖాన్.. ఏడవ స్థానంలో సాహో బ్యూటీ శ్రద్దా కపూర్‌.. ఎనిమిదవ స్థానంలో దిశా పటానీ నిలిచింది. ఇక చివరి రెండు స్థానాల్లో ప్రియాంక చోప్రా మరియు ఐశ్వర్య రాయ్ ఉన్నారు.

బాలీవుడ్‌ లో దాదాపుగా రెండు దశాబ్దాలుగా కొనసాగుతున్న సీనియర్ స్టార్‌ హీరోయిన్‌ ఐశ్వర్య రాయ్ కి ఈ జాబితాలో చోటు దక్కింది. అయితే ఆమె కి పదవ స్థానం దక్కడం పట్ల అభిమానులు ఒకింత అసహనం వ్యక్తం చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో ఐశ్వర్య రాయ్ సందడి పెద్దగా ఉండదు. కానీ ఆమె నటించిన పొన్నియన్ సెల్వన్‌ సినిమా విడుదలకాబోతున్న కారణంగా ఆమె గురించిన చర్చ జరిగింది. అందుకే పదో స్థానంలో నిలిచింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News