బాలీవుడ్ స్టార్ జోడీ ఆలియా భట్ మరియు రణబీర్ కపూర్ ల వివాహం ఈనెల 14 లేదా 15న జరగాల్సి ఉంది. పెళ్లికి సంబంధించిన అధికారిక ప్రకటన అయితే వెళ్లడించలేదు కాని చాలా మంది ఆ రెండు తేదీల్లో ఒక తేదీన పెళ్లి ఉంటుందని.. 17వ తారీకున తాజ్ మహల్ హోటల్ లో రిసెప్షన్ ఉంటుందని అన్నారు. కాని తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం పెళ్లి వాయిదా పడ్డట్లుగా తెలుస్తోంది.
ఆలియా భట్ మరియు రణబీర్ కపూర్ ల వివాహం అంటే దేశ వ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ ఉంది. అయినా కూడా అతి తక్కువ మంది గెస్ట్ లను ఆహ్వానిస్తున్నారు. ఆ అతి తక్కువ మందిలో అత్యంత ప్రముఖ వ్యక్తులు ఉండబోతున్నారు. అందుకే పెళ్లి వద్ద సెక్యూరిటీ విషయంలో చాలా సీరియస్ గా ఉండాల్సిన అవసరం ఉంది. అందుకే సెక్యూరిటీ రీజన్స్ రీత్యా పెళ్లిని వాయిదా వేసినట్లుగా తెలుస్తోంది.
పెళ్లి ని మరీ ఎక్కువ దూరం వాయిదా వేయకుండా వారం రోజుల తర్వాత అంటే ఏప్రిల్ 20వ తారీకున నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. భారీ ఎత్తున ఏర్పాట్లు చేసిన తర్వాత వాయిదా వేయడం అంటే ఖచ్చితంగా చాలా నష్టం అనడంలో సందేహం లేదు. కాని సెక్యూరిటీ కారణాల వల్ల పెళ్లి తంతును వాయిదా వేసుకోవాల్సి వచ్చిందని బాలీవుడ్ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.
తెలుగు లో ఆలియా భట్ ఆర్ ఆర్ ఆర్ సినిమా తో ఎంట్రీ ఇచ్చిన విషయం తెల్సిందే. ఆ సినిమా లో ఆమె పాత్ర చిన్నదే అయినా కూడా కథ లో చాలా కీలకం గా ఉంటుంది. అందుకే సినిమా లో ఆమె పాత్ర చిన్నదే అయినా ఆమె ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది. సినిమా లో తన పాత్ర చిన్నగా ఉందంటూ అలిగింది అంటూ పుకార్లు వచ్చాయి. కాని అవి నిజం కాదని ఆలియా స్వయంగా మీడియా ముందుకు వచ్చి చెప్పింది.
ఇక బాలీవుడ్ లో గంగూ బాయ్ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆలియా భట్ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. కమర్షియల్ గా ఆలియా భట్ లేడీ ఓరియంటెడ్ చిత్రాల్లో టాప్ లో నిలిచింది. భారీ అంచనాల నడుమ రూపొందిన గంగూ భాయ్ సినిమా లో ఆలియా భట్ నటన మరియు ఆమె యొక్క బాడీ లాంగ్వేజ్ ను ప్రతి ఒక్కరు కూడా అభిమానించారు. అందుకే ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.