హీరోయిన్‌కి కోపం తెప్పించిన దర్శకుడు
బాలీవుడ్‌లో పెద్ద పెద్ద స్టార్స్ వంద కోట్ల వసూళ్లు రాబట్టడం కోసం కిందా మీదా పడుతూ ఉంటే సన్నీ డియోల్ చిన్న సినిమాతో ఏకంగా వందల కోట్ల వసూళ్లు రాబట్టాడు.
బాలీవుడ్‌లో పెద్ద పెద్ద స్టార్స్ వంద కోట్ల వసూళ్లు రాబట్టడం కోసం కిందా మీదా పడుతూ ఉంటే సన్నీ డియోల్ చిన్న సినిమాతో ఏకంగా వందల కోట్ల వసూళ్లు రాబట్టాడు. వందల కోట్ల బడ్జెట్‌తో రూపొందిన స్టార్ హీరోల సినిమాలు, సూపర్ స్టార్ హీరోల సినిమాలు బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడుతూ ఉంటే సన్నీ డియోల్ నటించిన రూ.60 కోట్ల సినిమా బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.600 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టడం ద్వారా బాక్సాఫీస్ సంచలనంగా నిలిచిన విషయం తెల్సిందే. గదర్ సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన గదర్ 2 సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేయడం మాత్రమే కాకుండా అందరికీ షాకింగ్‌గానూ నిలిచిన విషయం తెలిసిందే.
గదర్ 2 సినిమాలో సన్నీ డియోల్‌తో పాటు అమీషా పటేల్ నటించింది. ఇద్దరి నటనకు మంచి మార్కులు పడ్డాయి. తాజాగా అమీషా పటేల్ పాత్ర గురించి దర్శకుడు అనిల్ శర్మ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అత్త పాత్రలో నటించేందుకు అమీషా పటేల్ గారిని ఒప్పించేందుకు చాలా ప్రయత్నించాము. కానీ ఆమె అందుకు ఒప్పుకోలేదు. నర్గీస్ దత్ వంటి గొప్ప వారు చిన్న వయసులో అత్త పాత్రల్లో నటించారు అనే విషయాన్ని ఆమెకు చెప్పేందుకు ప్రయత్నించాము. కానీ ఆమె మాత్రం ఒప్పుకోలేదు అన్నాడు. ఆమె తీరుపై సున్నితంగా దర్శకుడు విమర్శలు చేయడం చర్చనీయాంశంగా మారింది.
దర్శకుడు అనిల్ శర్మ వ్యాఖ్యలను హీరోయిన్ అమీషా పటేల్ తీవ్రంగా వ్యతిరేకించింది. సోషల్ మీడియా ద్వారా ఆయన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చింది. ఆమె స్పందిస్తూ... డియర్ అనిల్, ఇది నిజ జీవితంకు సంబంధించిన విషయం కాదు, ఇది కేవలం సినిమా మాత్రమే. సినిమాలో నేను ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేది పూర్తిగా నా స్వేచ్ఛ, నా హక్కు. నా వ్యక్తిగత విషయాల గురించి మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు. నేను ఈ సినిమా కోసమే కాదు, ఏ సినిమా కోసమూ అత్త పాత్ర చేయాలి అనుకోవడం లేదు, నా కంటూ కొన్ని ఆలోచనలు ఉంటాయి, వాటికి తగ్గట్టు నేను నడుచుకోవాలి అనుకుంటాను అన్నారు.
అత్త పాత్రలు పోషించడం కోసం రూ.100 కోట్ల పారితోషికం ఇచ్చినా తాను సున్నితంగా తిరస్కరిస్తాను అని, తనకు ఇష్టం లేని పాత్రలను చేయించడం కోసం ప్రయత్నించడం ఎందుకు అంటూ ఆమె అసహనం వ్యక్తం చేసింది. ఈమె గతంలోనూ దర్శకుడు చెప్పకుండా క్లైమాక్స్ మార్చాడని, ఆయన తీరు ఏమాత్రం బాగాలేదు అంటూ అసహనం వ్యక్తం చేసింది. మొత్తానికి సినిమాలో ఆమె యొక్క పాత్రకు మంచి మార్కులు వచ్చినా దర్శకుడు మళ్లీ మళ్లీ ఆ విషయాలను చెప్పడం ద్వారా హీరోయిన్‌కి కోపం తెప్పిస్తున్నాడు. ఈసారి అమీషా ఇచ్చిన కౌంటర్‌తో దర్శకుడు ఇక ముందు ఏ విషయాన్ని మాట్లాడకుండా ఉటాడేమో చూడాలి.