బాలీవుడ్ టు టాలీవుడ్ ఇటీవల ఆలియా పేరు మార్మోగుతోంది. వరుస బ్లాక్ బస్టర్లతో ఉత్తరాది పరిశ్రమలో సంచలనాలు నమోదు చేసిన ఆలియా తెలుగు సినీపరిశ్రమలో అడుగు పెడుతుండడం అందునా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన ఆర్.ఆర్.ఆర్ లాంటి భారీ పాన్ ఇండియా చిత్రంలో నటిస్తుండడంతో ఒకటే ఆసక్తి నెలకొంది. అన్నీ కుదిరితే ఆర్.ఆర్.ఆర్ ఈపాటికే రిలీజ్ కావాల్సినది. కానీ మహమ్మారీ క్రైసిస్ అన్నిరకాలుగా ఇబ్బందిపెడుతోంది. ఇదొక్కటే కాదు ఆలియా నటించిన బ్రహ్మాస్త్ర సహా పలు చిత్రాలు రిలీజ్ కి రావాల్సినవి పెండింగులో ఉండిపోయాయి. ఒక రకంగా ఆలియా నటించిన పాన్ ఇండియా సినిమాలన్నీ అనవసర గందరగోళంలో పడిపోయాయనే చెప్పాలి.
అయితే ఏ పరిస్థితి ఎలా ఉన్నా.. ఆలియాకు ఆఫర్లు మాత్రం ఆగడం లేదు. ఓవైపు సినిమాలు రిలీజ్ కాకపోయినా మరోవైపు సినిమాలకు సంతకాలు చేస్తూ క్షణం తీరిక లేనంత బిజీ అయిపోతోంది. ఈ ప్రతిభావంతులైన నటి కాల్షీట్ల కోసం అనేక మంది సీనియర్లతో పాటు అగ్ర దర్శకులు వేచి ఉన్నారు.
తాజా సమాచారం ప్రకారం.. ఆస్కార్ విజేత కం సౌండ్ డిజైనర్ రసూల్ పోకుట్టి తొలిసారి నిర్మాతగా మారి రూపొందించనున్న తాజా చిత్రంలో అలియా భట్ నటించనుంది. రసూల్ కొంతకాలంగా ఈ ప్రాజెక్ట్ కోసం పని చేస్తున్నాడు. ఇండో-చైనా సరిహద్దులో జరిగిన కొన్ని నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కనున్న రొమాంటిక్ ఎంటర్ టైనర్ ఇది. 1967 లో నాథుల (ఇండో చైనా) సరిహద్దు నేపథ్యంలో కథాంశమిది. ఇటీవలి కొన్ని ఎపిసోడ్లకు సంబంధించిన సమాచారం సేకరించారు.
సరిహద్దుల్లో బాబా హర్భజన్ సింగ్ అనే భారతీయ సైనికుడి వీర ప్రేమ కథ ఇదని తెలుస్తోంది. త్వరలోనే అధికారికంగా ఈ మూవీలో పని చేసే నటీనటులు సహా సాంకేతిక నిపుణుల వివరాల్ని ప్రకటిస్తామని రసుల్ పూకుట్టి తెలిపారు. ఆలియా ఈ మూవీలో నటించేందుకు ఎంతో ఎగ్జయిటింగ్ గా వేచి చూస్తోందట.