తార‌క్ త‌ర్వాత బ‌న్నీతోనే.. ఆలియా హింట్!

Update: 2022-02-18 04:41 GMT
RRRలో సీత పాత్ర‌లో న‌టిస్తోంది ఆలియా భ‌ట్. రామ్ చ‌ర‌ణ్ అల్లూరి సీతారామ‌రాజుగా క‌నిపించ‌నుండ‌గా అత‌డికి జోడీగా క‌నిపించనుంది. ఆలియా క‌నిపించేది కొన్ని నిమిషాలే అయినా త‌ను తెర‌పై క‌నిపించినంత‌సేపూ క‌ళ్ల‌ప్ప‌గించాల్సిందే అన్నంత‌గా  ఆ పాత్ర‌ను ద‌ర్శ‌కధీరుడు రాజ‌మౌళి డిజైన్ చేశార‌ని టాక్ వినిపించింది.

ఇదిలా ఉంటే ఆలియా కోసం టాలీవుడ్ స్టార్ హీరోలు పోటీ ప‌డుతున్న సంగ‌తి తెలిసిందే. చ‌రణ్ స‌ర‌స‌న డెబ్యూ ఇస్తున్న ఈ బ్యూటీ ఆ త‌ర్వాత కూడా ఆర్.ఆర్.ఆర్ కోస్టార్ తార‌క్ తో జ‌త క‌ట్ట‌నుంది. కొర‌టాల‌- ఎన్టీఆర్ సినిమాలో ఆలియాని క‌థానాయిక‌గా ఫైన‌ల్ చేసిన‌ట్టు ఇటీవ‌ల క‌థ‌నాలొచ్చాయి. దీనిపై ఇంకా అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డాల్సి ఉంది. ఇంత‌లోనే ఓ ఇంట‌ర్వ్యూలో ఆలియా చెప్పిన సంగ‌తులు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి. చ‌రణ్‌- ఎన్టీఆర్ త‌ర్వాత బ‌న్నీతో న‌టించేందుకు ఆలియా ఆస‌క్తిని క‌న‌బ‌ర‌చ‌డం విశేషం.

అంతేకాదు.. బ‌న్నీని తాను ఎంత‌గా అభిమానిస్తుందో ఎక్స్ ప్రెస్ చేసేందుకు ఏమాత్రం వెన‌కాడ‌లేదు. బ‌న్నీకోసం తాను ఒక స్టోరి లైన్  కూడా చెప్పుకొచ్చింది ఆలియా. ఆ క‌థ ఎలా ఉంటుంది? అంటే అందులో బ‌న్నీ నేను దుష్ట‌శ‌క్తుల‌పై పోరాడ‌తాం! అంటూ లైన్ చెప్పేసింది. ఇప్పుడు ద‌ర్శ‌క‌ర‌చ‌యిత‌లు ఈ లైన్ తో స్క్రిప్ట్ ని రెడీ చేస్తే వెంట‌నే దానికి సంత‌కం చేసేందుకు ఆలియాకు ఎలాంటి అభ్యంత‌రం లేదు. అంతేకాదు బ‌న్నీలో క్వాలిటీస్ గురించి ఆలియా ఎంతో అందంగా చెప్పుకొచ్చింది. అత‌డు డ్యాన్సులు అద‌ర‌గొడ‌తాడ‌ని త‌న ప‌ని తీరు అద్భుతంగా ఉంటుంద‌ని కూడా పొగిడేసింది. ఎంతో స్టైలిష్ గా ఉంటాడ‌ని కూడా ఐక‌న్ స్టార్ కి కితాబిచ్చింది.

చూస్తుంటే ఆలియా ఇక ప‌ర్మినెంట్ గా టాలీవుడ్ కే అంకిత‌మ‌వ్వ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. చ‌ర‌ణ్ - తార‌క్ - బ‌న్నీ త‌ర్వాత ఎవ‌రితో న‌టిస్తుంది? అంటే .. అది క‌చ్ఛితంగా ప్ర‌భాస్ అయ్యుండాలి. వ‌రుస‌గా టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ల‌కు సై అనేస్తుంద‌న్న‌మాట‌. అలియా తన తదుపరి చిత్రం గంగూబాయి కతియావాడి రిలీజ్ ప్ర‌మోష‌న్స్ లో బిజీగా ఉంది. ఇంట‌ర్వ్యూల్లో తెలుగు హీరోల్లో త‌న ఫేవ‌రెట్ల గురించి హింట్ ఇచ్చేస్తోంది. కేవ‌లం స్టార్ హీరోల‌కు మాత్ర‌మే!న‌నికూడా చెప్పేస్తోంది.

భన్సాలీ హీరోయిన్ గా న‌టించాల‌న్న కోరిక ఫ‌లించింది. అది గంగూబాయితో నిజమైంది కాబ‌ట్టి రెండవది బన్నీతో కలిసి పని చేయాలనుకుంటోంది. ఇదీ నెర‌వేరాల‌ని ఆశిద్దాం. అల్లు అర్జున్ తో ఎలాంటి సినిమాలో నటించాలనుకుంటున్నారు? అంటే.. వెంట‌నే స్టోరీ లైన్ త‌నే చెప్పేసింద‌న్న‌మాట‌. ``ఇది చెప్పడానికి నేను ఫిల్మ్ మేకర్ ని లేదా రచయితను కాదని నాకు తెలుసు. కానీ బన్నీ చాలా స్టైలిష్ గా ఉంటాడు.

స్టైలిష్ అంటే ఇక్కడ తొడుక్కునే దుస్తులు మాత్రమే కాదు. నేను అతని పనితీరు గురించి మాట్లాడుతున్నాను. అతను ఇలాంటి స్టైలిష్ లుక్ ను కలిగి ఉన్నాడు. అతను డ్యాన్స్ చేసే విధానం అద్భుతం. కెమెరాపై అతనికి అలాంటి కమాండ్ ఉంది. బహుశా మేం క‌లిసి ప‌ని చేస్తే.. ఒకవిధంగా ఈవిల్స్ తో పోరాడతాం`` అని చెప్పింది. దయచేసి ఎవరైనా ఇలాంటి క‌థ‌ను రాయాలని నేను భావిస్తున్నాను అని అంది. ద‌ర్శ‌క‌ర‌చ‌యిత‌లూ వింటున్నారా?

మ‌రోవైపు ఆలియ భ‌ట్ న‌టించిన భారీ పాన్ ఇండియా చిత్రం బ్ర‌హ్మాస్త్ర రిలీజ్ కి రెడీ అవుతోంది. ఇందులో ప్రియుడు ర‌ణ‌బీర్ క‌థానాయ‌కుడిగా న‌టించాడు. నాగార్జున - అమితాబ్ వంటి టాప్ స్టార్లు ఉన్నారు. బ్ర‌హ్మాస్త్ర తాజా టీజ‌ర్ అంత‌ర్జాలంలోకి దూసుకెళ్లిన సంగ‌తి తెలిసిందే.
Tags:    

Similar News