చర‌ణ్‌-శంక‌ర్ క్రేజీ పాన్ ఇండియా మూవీలో ఆలియా?

Update: 2021-03-16 14:30 GMT
బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా ఆఫ‌ర్ల‌తో ఉక్కిరిబిక్కిరి అవుతోంది ఆలియా. నేటిత‌రంలో ఊపిరిస‌ల‌ప‌నివ్వ‌ని షెడ్యూళ్ల‌తో క్ష‌ణం తీరిక లేకుండా అసాధార‌ణంగా ఆర్జిస్తున్న యువ‌క‌థానాయిక‌గా ఆలియా పేరు మార్మోగుతోంది. రాజీ- గ‌ల్లీ బోయ్స్ లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల్లో న‌టించిన ఆలియా ఆ త‌ర్వాత వెనుదిరిగి చూసిందే లేదు.

ఈ ట్యాలెంటెడ్ బ్యూటీ న‌ట‌న‌కు ఫిదా అవ్వ‌ని వాళ్లే లేరు. ఇప్ప‌టికిప్పుడు బాహుబ‌లి ద‌ర్శ‌కుడు ఎస్.ఎస్.రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న ఆర్.ఆర్.ఆర్ లో చ‌ర‌ణ్ స‌ర‌స‌న క‌థానాయిక‌గా న‌టిస్తోంది. మ‌న్యం వీరుడు అల్లూరి(చెర్రీ) భార్య‌ సీత(ఆలియా)గా తెలుగు అభిమానుల‌కు ప‌రిచ‌య‌మ‌వుతోంది. దీంతో పాటే అటు బ్ర‌హ్మాస్త్ర లాంటి పాన్ ఇండియా సినిమాతో హిందీ ఆడియెన్ స‌హా వ‌ర‌ల్డ్ ఆడియెన్ ముందుకు రానుంది.

ఈలోగానే క‌ళాత్మ‌క చిత్రాల ద‌ర్శ‌కుడు సంజ‌య్ లీలా భ‌న్సాలీ తెరకెక్కిస్తున్న `గంగూభాయి క‌తియావాడీ`లో వేశ్యా గృహ నిర్వాహ‌కురాలిగా న‌టిస్తోంది. తాజా స‌మాచారం మేర‌కు.. ఇండియా లెవ‌ల్లో సంచ‌ల‌నాల‌కు రెడీ అవుతున్న మ‌రో క్రేజీ పాన్ ఇండియా చిత్రంలో ఆలియా అవ‌కాశం ద‌క్కించుకుంద‌న్న క‌థ‌నాలు వేడెక్కిస్తున్నాయి. మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ స‌ర‌స‌న శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ఆలియా క‌థానాయిక‌గా ఫైన‌ల్ అయ్యింద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఇంత‌కుముందు కియ‌రా అద్వాణీ- ర‌ష్మిక మంద‌న అంటూ ర‌క‌ర‌కాల పేర్లు వినిపించాయి. కానీ ఇప్పుడు శంక‌ర్ దృష్టి ఆలియాపై ప‌డింద‌ని తెలుస్తోంది. అయితే దీనిపై ఇంకా అధికారిక స‌మాచారం ఏదీ లేదు. ఆఫ‌ర్ నిజ‌మైతే బ్యాక్ టు బ్యాక్ చెర్రీ స‌ర‌స‌న న‌టిస్తున్న‌ భామ‌గా ఆలియా మెగాభిమానుల ఫేవ‌రెట్ స్టార్ గా వెలిగిపోనుంది.
Tags:    

Similar News