కొత్త ఏడాది పాత చిత్రాల హంగామా..?

ఇక లేటెస్ట్ గా న్యూ ఇయర్ కొత్త ఏడాదికి మరో 3 సినిమాలు రీ రిలీజ్ కాబోతున్నాయి. కొత్త ఏడాదికి పాత చిత్రాల హంగామా ఫ్యాన్స్ ని అలరించనుంది.

Update: 2024-12-26 06:36 GMT

ఈమధ్య స్టార్ సినిమాల రీ రిలీజ్ హంగామా తెలిసిందే. తమ అభిమాన హీరో పాత సినిమా మళ్లీ తెర మీద చూసే అవకాశం రావడం చాలా అరుదు. అందుకే స్టార్ సినిమాల రీ రిలీజ్ టైం లో ఫ్యాన్స్ హంగామా ఒక రేంజ్ లో ఉంటుంది. దాదాపు స్టార్ హీరోల వింటేజ్ సినిమాలన్నీ కూదా ఒక రౌండ్ వేస్తున్నాయి. ఇక లేటెస్ట్ గా న్యూ ఇయర్ కొత్త ఏడాదికి మరో 3 సినిమాలు రీ రిలీజ్ కాబోతున్నాయి. కొత్త ఏడాదికి పాత చిత్రాల హంగామా ఫ్యాన్స్ ని అలరించనుంది.

న్యూ ఇయర్ కి మెగాస్టార్ చిరంజీవి హిట్లర్ సినిమా రీ రిలీజ్ అవుతుంది. చిరు సినిమా రీ రిలీజ్ అంటే ఆ రేంజ్ ఏంటో తెలిసిందే. తెర మీద మరోసారి హిట్లర్ మాధవ రావు మాస్ మేనియా చూడబోతున్నారు. మెగా ఫ్యాన్స్ అంతా కూడా ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి ముత్యాల సుబ్బయ్య కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా చిరుకి వరుస ఫ్లాపుల నుంచి ఒడ్డున పడేసింది.

ఇక కొత్త ఏడాది 2025 కి వెల్కం చెబుతూ నితిన్ సై సినిమా కూడా రిలీజ్ అవుతుంది. దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా రగ్బి ఆట నేపథ్యంతో తెరకెక్కింది. ఈ సినిమాలో జెనిలియా హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా కూడా కొత్త ఏడాదికి రీ రిలీజ్ అవుతుంది. కొత్త ఏడాదికి సిద్ధార్థ్ ఓయ్ కూడా రీ రిలీజ్ అవుతుంది. ఆల్రెడీ ఓయ్ రీ రిలీజ్ అవ్వగా యూత్ నుంచి ఆ సినిమాకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది.

అందుకే ఆ సినిమాను మళ్లీ రీ రిలీజ్ చేయబోతున్నారు. 2025 జనవరి 1 కొత్త సినిమాల కన్నా ఈ మూడు రీ రిలీజ్ సినిమాల హడావిడి ఉండబోతుంది. తప్పకుండా ఈ సినిమాలతో తెలుగు ఆడియన్స్ సూపర్ ఎంటర్టైన్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు. ఎలాగు కొత్త సినిమాలు లేక థియేటర్లు వెలవెలబోతున్నాయి. కాబట్టి కొత్త ఏడాదికి ఈ రీ రిలీజ్ సినిమాలు అదరగొట్టబోతున్నాయి. తప్పకుండా ఈ సినిమాల వల్ల తెలుగు ఆడియన్స్ అంతా కూడా సూపర్ ఎంటర్టైన్ అవ్వనున్నారు. న్యూ ఇయర్ హంగామాలో ఈ పాత సినిమాలు కూడా ఆడియన్స్ లో జోష్ నింపనున్నాయి.

Tags:    

Similar News