రెట్రో పూజా ఫ్యాన్స్ అప్సెట్.. ఎందుకంటే..?

ఆ విషయం తెలిసి కూడా సూర్య రెట్రో సినిమాలో ఆమెకు కాస్త బరువైన రోల్ ఇచ్చినట్టు అనిపిస్తుంది.

Update: 2024-12-26 05:23 GMT

బుట్ట బొమ్మ పూజా హెగ్దే సినిమాలో ఉంది అంటే గ్లామర్ విషయంలో ఎలాంటి డౌట్లు లేవని ఫ్యాన్స్ ఫిక్స్ అవుతారు. అమ్మడు అలా థై షో చేస్తుంటే చాలు బాక్సాఫీస్ దగ్గర వసూళ్లు కురవాల్సిందే. ఇప్పటివరకు పూజా హెగ్దే చేసిన సినిమాలన్నీ చూస్తే ఎక్కువ శాతం అమ్మడు గ్లామర్ షో చేసిన సినిమాలే ఆమెకు క్రేజ్ తెచ్చాయి. కాదని పాత్ర ప్రాధాన్యత ఉన్న పాత్రలను చేయాలని చూస్తే రిజల్ట్ వేరేలా వచ్చాయి. ఆ విషయం తెలిసి కూడా సూర్య రెట్రో సినిమాలో ఆమెకు కాస్త బరువైన రోల్ ఇచ్చినట్టు అనిపిస్తుంది.

కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్షన్ లో సూర్య హీరోగా వస్తున్న రెట్రో సినిమాలో పూజా హెగ్దే హీరోయిన్ గా నటిస్తుంది. సినిమా నుంచి లేటెస్ట్ గా టీజర్ రాగా అందులో సూర్య వింటేజ్ లుక్ ఫ్యాన్స్ ని థ్రిల్ చేయగా పూజా లుక్స్ మాత్రం డిజప్పాయింట్ చేశాయి. పూజా హెగ్దే అనగానే తెర మీద అందాల భామ గుర్తుకొస్తుంది. కానీ పూజా ఇమేజ్ ని మార్చేందుకు చేస్తున్న ప్రయత్నంలో భాగంగానే రెట్రోలో ఆమెను డీ గ్లామర్ గా అంటే న్యాచురల్ లుక్స్ తో కనిపించేలా చేశారు. మేకప్ కూడా అంతగా కుదిరినట్టు అనిపించలేదు.

పూజా బేబీకి ప్లస్సే ఆమె గ్లామర్ అలాంటిది సూర్య సినిమాలో అది కాకుండా ఆమెను వెరైటీగా చూపిస్తాం అంటే మాత్రం బుట్ట బొమ్మ ఫ్యాన్స్ ఒప్పుకునే పరిస్థితి లేదు. పూజాని అందంగా చూపిస్తేనే సినిమాకు ప్లస్ అవుతుంది అలా కాకుండా ప్రయోగాలు చేస్తే మాత్రం సీన్ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. పూజా హెగ్దే గ్లామర్ పరంగా ఎలాంటి అడ్డు గేట్లు వేయదు. సినిమాకు ప్లస్ అవుతుంది అంటే అమ్మడు రెచ్చిపోవడానికి కూడా రెడీ అంటుంది.

ఐతే సూర్య రెట్రో టీజర్ లో మాత్రం పూజా లుక్స్ షాక్ ఇచ్చాయి. ఐతే టీజర్ లో కాబట్టి అలా చూపించి ఉండొచ్చు సినిమాలో ఆమెకు ప్లస్ అయిన గ్లామర్ ని బాగానే వాడి ఉండొచ్చు అంటున్నారు ఆడియన్స్. అసలే సౌత్ లో సినిమాలు లేక వచ్చిన సూర్య రెట్రో సినిమా మీద గంపెడు ఆశలు పెట్టుకున్న పూజా హెగ్దేకి ఈ సినిమా షాక్ ఇస్తే మాత్రం కెరీర్ మళ్లీ డైలమాలో పడే ఛాన్స్ ఉంటుంది. ఐతే రెట్రో టీజర్ చూస్తే డైరెక్టర్, హీరో ఇద్దరు చాలా కసితో తమని తాము ప్రూవ్ చేసుకోవాలి అన్నట్టుగా చేస్తున్నట్టు అనిపించింది.

Tags:    

Similar News