బాలీవుడ్ స్టార్ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ ఇంకా ఆయన భార్య ఆలియా సిద్దిఖీ విడాకులు తీసుకునేందుకు కోర్టుకు వెళ్లారు. కోర్టు వీరికి అధికారికంగా విడాకులు మంజూరు చేయలేదు. ప్రస్తుతం విడాకుల కేసు కోర్టులో నడుస్తోంది. ఇలాంటి సమయంలో ఆలియా సిద్దిఖీ ఒక ఇంటర్వ్యూలో నవాజుద్దీన్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది. అతడిని పెళ్లి చేసుకోక ముందు నుండే అతడి వల్ల నేను ఇబ్బందులు పడుతున్నాను. 15 ఏళ్ల మా వైవాహిక జీవితంలో ఎప్పుడు సంతోషం లేదని ఆమె పేర్కొంది.
ఒక సినిమా షూటింగ్ సమయంలో మా ఇద్దరి మద్య పరిచయం ఏర్పడినది. ఆ పరిచయంతో ఇద్దరం ప్రేమించుకున్నాం. నేను అతడిని ప్రేమించిన సమయంలోనే మరో మహిళతో అతడికి సంబంధం ఉంది. పెళ్లి తర్వాత అంతా మారిపోతుందని భావించాను. కాని 15 ఏళ్ల తర్వాత కూడా అతడి ప్రవర్తనలో మార్పు రాలేదు. నేను కాకుండా ఆయన జీవితంలో మరో మహిళ కూడా ఉంది. నేను ప్రెగ్నెంట్ అయిన సమయంలో అత్యంత దారుణమైన పరిస్థితులు ఎదుర్కొన్నాను.
ఎన్నో సార్లు ఒంటరిగా హాస్పిటల్‌లో చెకింగ్‌కు వెళ్లాను. గర్బవతిని అయిన నేను స్వయంగా కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్లాను. డెలవరీకి ఒంటరికి కారు డ్రైవ్ చేసుకుంటూ హాస్పిటల్‌కు వెళ్లిన ఏకైక మహిళను నేను అయ్యి ఉంటాను. నేను హాస్పిటల్‌లో జాయిన్ అయిన తర్వాత అతడు వచ్చాడంటూ ఆలియా ఆరోపించింది. నేను పురిటి నొప్పులు పడుతుంటే బయట ఎక్కడో ప్రియురాలితో ఫోన్‌లో మాట్లాడుకుంటూ ఉన్నాడని కూడా ఆలియా ఆరోపించింది. నవాజుద్దీన్ వల్ల నేను నరకం చూశానంటూ ఆమె సంచలన వ్యాఖ్యలు చేసింది.