గ‌ల్లీబోయ్ జంట .. క‌రణ్ ద‌ర్శ‌క‌త్వంలో!

Update: 2021-02-01 03:22 GMT
బాలీవుడ్ స్టార్ హీరో రణ్ వీర్ సింగ్- అలియా భట్ చివరిసారిగా 2019 మ్యూజికల్ హిట్ `గల్లీ బాయ్`‌లో కనిపించారు. ఆస్కార్ బ‌రిలోనూ ఈ మూవీ నామినేట్ అయిన సంగ‌తి తెలిసిన‌దే. గ‌ల్లీలో ర్యాప‌ర్ గా కెరీర్ కోసం త‌పించేవాడిగా ర‌ణ‌వీర్ న‌టించ‌గా.. ప్రేమ కోసం ప్రాణం పెట్టే డీప్ ల‌వ‌ర్ గా ఆలియాభ‌ట్ న‌టించింది. ఆ ఇద్ద‌రి న‌ట‌న ఆద్యంతం క‌ట్టి ప‌డేస్తుంది.  తాజా స‌మాచారం ప్ర‌కారం...ఈ హిట్ పెయిర్ త్వరలో కొత్త చిత్రంలో నటించడానికి సన్నద్ధమవుతోందని తెలిసింది.

మ‌రోసారి ఈ జంట ప్రేమ‌క‌థా చిత్రంలోనే న‌టించ‌నున్నారు. ప్రఖ్యాత ద‌ర్శ‌క‌నిర్మాత కరణ్ జోహార్ స్వీయ‌ దర్శకత్వంలో ఈ మూవీని తెర‌కెక్కించ‌నున్నారు. క‌ర‌ణ్ ఇటీవ‌ల నిర్మాత‌గా మాత్ర‌మే కొన‌సాగుతున్నారు. కాఫీ విత్ క‌ర‌ణ్ షోతో బిజీ. మ‌రోవైపు త‌క్త్ లాంటి భారీ హిస్టారిక‌ల్ సినిమాని ప్రారంభించినా అది ఎందుక‌నో ఆల‌స్య‌మవుతోంది.

2012 యూత్ ‌ఫుల్ డ్రామా.. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ కి ..ఆ త‌ర్వాత‌ 2016 చిత్రం ఏ దిల్ హై ముష్కిల్ కి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఇప్ప‌టికి రణ్ ‌వీర్ సింగ్ - అలియా భట్ చిత్రానికి కరణ్ జోహార్ దర్శకత్వం వహించబోతున్నారు.
Tags:    

Similar News