అక్కడ 23 ఏళ్ళ పవన్ రికార్డ్ బ్రేక్ చేసిన పుష్ప 2!
ఇప్పటి వరకు ఈ మూవీ సంధ్య థియేటర్ లో ఏకంగా 1.59 కోట్లు కలెక్ట్ చేసింది. 23 ఏళ్ళ క్రితం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన సూపర్ హిట్ మూవీ 'ఖుషి' ఇదే థియేటర్ లో 1.53 కోట్లు వసూళ్లు చేసింది.
'పుష్ప 2' మూవీ కలెక్షన్స్ తో చాలా రికార్డులు బ్రేక్ అవుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆల్ టైం రికార్డ్స్ గా ఉన్నవాటిని బీట్ చేసిన ఈ మూవీ రేర్ ఫీట్ అందుకుంది. అది కూడా హైదరాబాద్ సిటీలో 'పుష్ప 2' మూవీ ఖాతాలో ఈ రికార్డ్ చేరడం విశేషం. హైదరాబాద్ అంటే అందరూ మాట్లాడుకునేది సంధ్య థియేటర్ గురించి. ఈ థియేటర్ లో సినిమాకి పాజిటివ్ టాక్ వస్తే కచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందని టాలీవుడ్ నమ్మకం.
స్టార్ హీరోలు కూడా తమ సినిమాల రిలీజ్ తర్వాత ప్రేక్షకులని కలవడానికి సంధ్య థియేటర్ కి వెళ్తూ ఉంటారు. అల్లు అర్జున్ కూడా సంధ్య థియేటర్ లో 'పుష్ప 2' మూవీ ప్రీమియర్ షో చూడటానికి వెళ్లారు. అప్పుడు జరిగిన సంఘటన గురించి అందరికి తెలిసిందే. ఇదలా ఉంటే సంధ్య థియేటర్ లో 'పుష్ప 2' మూవీ మరో రకంగా వార్తల్లోకి వచ్చింది.
ఇప్పటి వరకు ఈ మూవీ సంధ్య థియేటర్ లో ఏకంగా 1.59 కోట్లు కలెక్ట్ చేసింది. 23 ఏళ్ళ క్రితం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన సూపర్ హిట్ మూవీ 'ఖుషి' ఇదే థియేటర్ లో 1.53 కోట్లు వసూళ్లు చేసింది. ఇప్పటి వరకు ఏ సినిమా కూడా సంధ్యలో ఈ వసూళ్లని అందుకోలేదు. అయితే 'పుష్ప 2' మాత్రం ఈ కలెక్షన్స్ ని క్రాస్ చేసి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది.
అయితే 'ఖుషి'తో పోల్చుకుంటే 'పుష్ప 2' మూవీ టికెట్ ధరలు చాలా ఎక్కువ. 23 ఏళ్ళ క్రితం కేవలం 5 నుంచి 50 రూపాయిల మధ్యలోనే సంధ్య థియేటర్ లో టికెట్ ధరలు ఉన్నాయి. ఆ సమయంలోనే లాంగ్ రన్ లో ఖుషి మూవీ భారీ కలెక్షన్స్ అందుకుంది. ఇప్పుడు టికెట్ ధరలు ఎక్కువ కావడంతో 'పుష్ప 2' మూవీ ఈజీగా ఖుషి రికార్డ్ ని బ్రేక్ చేయగలిగింది.
సంధ్య థియేటర్ లో 'పుష్ప 2' ప్రీమియర్ షో టికెట్ ధరలు 900 రూపాయిలు. తరువాత మొదటి వారం రోజులు 250 వరకు ఆ థియేటర్ లో టికెట్ రేట్లు ఉన్నాయి. తరువాత కూడా 100 రూపాయిలకి పైనే ధరలు ఉన్నాయి. ఈ రేట్లతో 'పుష్ప 2' మూవీ భారీ కలెక్షన్స్ ని అందుకోగలిగింది. ఈ లెక్కన చూసుకుంటే సంధ్య థియేటర్ లో 'ఖుషి' క్రియేట్ చేసిన ఫీట్ మాత్రం ఎవర్ గ్రీన్ గా ఉంటుందని చెప్పొచ్చు.