ఇలియానా రెండో బిడ్డ‌తో గర్భిణి?

దీనికి కార‌ణం కొత్త సంవ‌త్స‌రం వేళ ఇలియానా క్రిప్టిక్ ఇన్‌స్టా పోస్ట్. సోష‌ల్ మీడియాలో వీడియో ద్వారా తన గర్భం గురించి ఇండికేష‌న్ ఇచ్చింది.

Update: 2025-01-02 11:06 GMT

టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన ఇలియానా త‌మిళ, హిందీ చిత్ర‌సీమ‌లోను అగ్రహీరోల స‌ర‌స‌న న‌టించింది. రెండు ద‌శాబ్ధాల కెరీర్ ర‌న్ త‌ర్వాత ఈ గోవా బ్యూటీ జీవితంలో ఊహించని మలుపుల గురించి తెలిసిందే. విదేశీ ఫోటోగ్రాఫ‌ర్ ఆండ్రూ నీబోన్‌తో సుదీర్ఘ కాలం ప్రేమాయ‌ణం, బ్రేక‌ప్ త‌ర్వాత తీవ్ర‌మైన డిప్రెష‌న్ లోకి వెళ్లిపోయింది. ఆ త‌ర్వాత కొన్నేళ్ల పాటు మ‌ళ్లీ కెరీర్ ప‌రంగా కంబ్యాక్ కోసం ప్ర‌య‌త్నించినా ఆశించిన బ్రేక్ అందుకోలేక‌పోయింది.

 

ఆ త‌ర్వాత స‌డెన్ గా బిడ్డ‌కు త‌ల్లిన‌వుతున్నాను! అంటూ తొలి గ‌ర్భాన్ని ప్ర‌క‌టించింది. ఆ బిడ్డ‌కు తండ్రి ఎవ‌రో కూడా చాలా కాలం పాటు దాచి ఉంచింది. అత‌డు మైఖేల్ డోల‌న్.. విదేశీ ప్రియుడు.. పైగా శ్వేత‌జాతీయుడు.. డోల‌న్ అప్పుడ‌ప్పుడు అతిథిలా ఫోటోల్లో క‌నిపిస్తాడు త‌ప్ప బాలీవుడ్ స‌ర్కిల్స్ లో పెద్ద‌గా క‌నిపించ‌డు. కానీ అత‌డితో మొద‌టి బిడ్డ‌ను క‌న్న ఇలియానా ఇప్పుడు రెండో బిడ్డ‌కు జ‌న్మ‌నిస్తోంద‌ని టాక్ వినిపిస్తోంది.

దీనికి కార‌ణం కొత్త సంవ‌త్స‌రం వేళ ఇలియానా క్రిప్టిక్ ఇన్‌స్టా పోస్ట్. సోష‌ల్ మీడియాలో వీడియో ద్వారా తన గర్భం గురించి ఇండికేష‌న్ ఇచ్చింది. 2024 నాటి జ్ఞాపిక వీడియోను షేర్ చేసిన‌ప్పుడు ఇలియానా తన రెండవ బిడ్డతో గర్భవతి అనే విష‌యాన్ని అనుకోని రీతిలో చూపించింది. బేబి బంప్ అస్ప‌ష్ఠంగా క‌నిపిస్తోంది. ''ప్రేమ... శాంతి... దయ.. 2025 అంతా ఇంతే అని ఆశిస్తున్నాను'' అని ఇలియానా దీనికి క్యాప్షన్ ఇచ్చారు.

అయితే చూసేవారికి ఇలియానా ఫ్రెగ్నెంట్ అని క‌నిపెట్టే టెస్ట్ పెట్టింది. ఇల్లీ ఆనందం, భావోద్వేగ రూపం అభిమానులకు ఆసక్తిని కలిగించింది. దీంతో ఇన్ స్టాలో ర‌క‌ర‌కాల కామెంట్లు , మీమ్స్ క‌నిపిస్తున్నాయి. ''ఆగండి...అక్టోబర్...మళ్ళీ అభినందనలు!!! అని ఒక అభిమాని బిడ్డ‌ను ప్ర‌స‌వించే స‌మ‌యాన్ని డిక్లేర్ చేసాడు. రెండవ బిడ్డ 2025లో వస్తోంది? లేదా మేము తప్పుగా అర్థం చేసుకున్నామా? అంటూ మ‌రొక అభిమాని రాసాడు. ''మళ్ళీ అభినందనలు!! నూతన సంవత్సర శుభాకాంక్షలు'' అని మ‌రొక‌రు వ్యాఖ్యానించారు.

ఇలియానా అమెరికన్ వ్యాపారవేత్త మైఖేల్ డోలన్‌ను వివాహం చేసుకుంది. ఈ జంట తమ మొదటి బిడ్డను ఆగస్టు 2023లో స్వాగతించారు. కోవా ఫీనిక్స్ డోలన్ అని చిన్నారి బాల‌కుడికి పేరు పెట్టారు. కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.... ఇలియానా చివ‌రిగా ''దో ఔర్ దో ప్యార్'లో కనిపించింది.

Tags:    

Similar News