రామ్ చరణ్ తో వర్క్.. ఒక బిడ్డతో చేసినట్లు అనిపిస్తుంది: సముథ్రకని

ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను AMB లో నిర్వహించారు.

Update: 2025-01-02 12:45 GMT

దిల్ రాజు నిర్మాణంలో, శంకర్ దర్శకత్వంలో రూపొందిన మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్యాన్ ఇండియా మూవీ 'గేమ్ చేజర్' మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఇప్పటికే టీజర్ ద్వారా మంచి హైప్ క్రియేట్ చేసింది. ఇక సినిమాకు సంబంధించిన ప్రతి అప్డేట్ కూడా ఫ్యాన్స్‌లో ఎంతో ఆసక్తిని కలిగిస్తోంది. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను AMB లో నిర్వహించారు. ఈ వేడుకలో సినిమాలో నటించిన ప్రముఖ నటి నటులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ తమ అనుభవాలను ప్రత్యేకంగా పంచుకున్నారు.

ఈ సందర్భంగా దర్శకుడు, నటుడు సముథ్రకని మాట్లాడుతూ, "ప్రతి సంక్రాంతికి నేను ఏదో ఒక తెలుగు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాను. వచ్చిన ప్రతి సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంటోంది. అలాగే ఈ సంక్రాంతికి కూడా గేమ్ చేజర్ సినిమాతో మరో విజయాన్ని అందుకోవడం చాలా ఆనందంగా ఉంది. నాకు మంచి అవకాశాలు వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది.

ముఖ్యంగా శంకర్ సార్‌కు ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పాలి. ఈ సినిమాలో ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే, రామ్ చరణ్ గారితో ఆర్ఆర్ఆర్ లో బాబాయ్ పాత్రలో నటించాను. ఇప్పుడు ఈ సినిమాలో కూడా అదే తరహా పాత్రలో నటించడం చాలా స్పెషల్‌ గా అనిపిస్తోంది. చరణ్ సార్‌తో పని చేస్తుంటే ఒక యాక్టర్‌తో ఉన్న ఫీలింగ్ కాకుండా, ఒక బిడ్డతో వర్క్ చేస్తున్నట్లు అనిపిస్తూ ఉంటుంది. ఆయన ఒక్కో షాట్‌కు ఇచ్చే ఎనర్జీ సినిమాకు ఎంతగానో హెల్ప్ చేసింది."

"నిర్మాత దిల్ రాజు గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెబుతున్నాను. ప్రతి ఒక్కరికీ కూడా నా థ్యాంక్స్. ఎస్ జె సూర్య గారు కూడా ఇందులో చాలా చక్కగా నటించారు. తమిళంలో శివాజీ, తెలుగులో ఎన్టీఆర్ గురించి చెప్పే ఒక గొప్ప విషయం ఉంది. కెమెరా పెట్టగానే ఒక ఆఫ్ ఫీట్ వాళ్ళు పైకి ఎక్కేలా ఎనర్జీతో కనిపిస్తారు. అదే విధంగా ఎస్ జె సూర్య గారు యాక్షన్ అనగానే అలా పైపైకి విశ్వరూపం చూపిస్తారు. ఆయనతో కంటిన్యూస్‌గా పని చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. గేమ్ చేజర్ ఆయనకు ఒక మంచి సినిమాగా నిలుస్తుందని నమ్ముతున్నాను," అని సముథ్రకని వివరించారు.

Tags:    

Similar News