పుష్ప - ముఫాస మధ్యలో నలిగిన బేబీ జాన్
ఈ రెండు సినిమాల కంటే దారుణమైన కలెక్షన్స్ ని వరుణ్ ధావన్ ‘బేబీ జాన్’ అందుకుంది. ఈ సినిమాకి 18వ రోజు 3669 షోలు పడ్డాయి.
హాలీవుడ్ యానిమేషన్ సినిమాలకి ఇండియాలో కూడా మంచి ప్రేక్షకాదరణ వస్తూ ఉంటుందనే సంగతి అందరికి తెలిసిందే. ముఖ్యంగా ‘లయన్ కింగ్’ సిరీస్ కి ఇండియాలో ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. ఇందులో భాగంగా తాజాగా ‘ముఫాసా’ మూవీ వచ్చింది. ‘లయన్ కింగ్’ లో 5వ మూవీగా ఈ చిత్రం రిలీజ్ అయ్యింది. 200 మిలియన్ డాలర్స్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు.
డిసెంబర్ 20న రిలీజ్ అయిన ఈ చిత్రంలో ఇండియాలో హిందీ, తెలుగు, తమిళ్ భాషలలో కూడా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమాకి రెండో వారంలో కూడా మంచి వసూళ్లు వస్తూ ఉండటం విశేషం. ముఖ్యంగా నార్త్ ఇండియా బెల్ట్ లో డీసెంట్ వసూళ్లని ఈ చిత్రం అందుకుంటుంది. ఈ సినిమాలోని మెయిన్ లీడ్ లయన్ క్యారెక్టర్ కి షారుఖ్ ఖాన్ డబ్బింగ్ చెప్పారు.
ఆయన కూడా మూవీని బాగా ప్రమోట్ చేశారు. దీంతో థియేటర్స్ లో ఈ చిత్రానికి మంచి ఆదరణ లభిస్తోంది. 13వ రోజు హిందీలో ఈ సినిమా ఏకంగా 3.93 కోట్లు వస్తూళ్ళు చేసింది. 2246 షోలలో ఈ చిత్రం పడింది. అయితే దీనికంటే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప 2’ కి హిందీలో ఇంకా ఎక్కువ ఆదరణ లభిస్తోంది. 28వ రోజు ‘పుష్ప 2’ మూవీ థియేటర్స్ లో 9.6 కోట్ల నెట్ వసూళ్లు చేసిందంట.
ఈ సినిమాకి 28వ రోజు ఏకంగా 6683 షోలు పడ్డాయి. 29.12 శాతం ఆక్యుపెన్సీ నమోదు అయ్యింది. 10.22 కోట్ల గ్రాస్ కలెక్ట్ అయితే అందులో 9.6 కోట్ల నెట్ ఉంది. ‘ముఫాసా’ మూవీకి ‘పుష్ప 2’ కంటే అధికంగా 31.42 శాతం ఆక్యుపెన్సీ నమోదు అయ్యింది. అయితే ‘పుష్ప 2’తో పోలిస్తే ఆ సినిమాకి పడిన షోలు తక్కువ అందుకే కలెక్షన్స్ తగ్గాయి.
ఈ రెండు సినిమాల కంటే దారుణమైన కలెక్షన్స్ ని వరుణ్ ధావన్ ‘బేబీ జాన్’ అందుకుంది. ఈ సినిమాకి 18వ రోజు 3669 షోలు పడ్డాయి. 18.18 శాతం థియేటర్ ఆక్యుపెన్సీతో 2.95 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. అందులో 2.65 కోట్ల నెట్ ఉంది. స్ట్రైట్ హిందీ సినిమా కంటే డబ్బింగ్ సినిమాలుగా రిలీజ్ అయిన ‘పుష్ప 2’, ‘ముఫాసా’కి నార్త్ ఇండియా బెల్ట్ లో ఎక్కువ ఆదరణ లభిస్తూ ఉండటం విశేషం.
పుష్ప 2 - 28వ రోజు| 6,863 షోలు| ₹10.22 కోట్ల గ్రాస్| 29.12% థియేటర్స్ ఆక్యుపెన్సీ| ₹9.6 కోట్ల నెట్
ముఫాసా ది లయన్ కింగ్ - 13వ రోజు| 2,246 షోలు| ₹3.93 కోట్ల గ్రాస్| 31.42% థియేటర్స్ ఆక్యుపెన్సీ.
బేబీ జాన్ - 18వ రోజు|3,699 షోలు| ₹2.95 కోట్ల గ్రాస్| 18.18% థియేటర్స్ ఆక్యుపెన్సీ| ₹2.65 కోట్ల నెట్.