గేమ్ ఛేంజర్ అలెర్ట్.. ఫుల్ బందోబస్తు నడుమ ఫస్ట్ టైమ్ ఇలా..
ఇక ఈ పరిణామాల నేపథ్యంలో, రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటించిన గేమ్‌చేంజర్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ AMB సినిమాస్‌లో మంగళవారం జరిగింది.
సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటన తర్వాత తెలంగాణలో సినిమా ఈవెంట్స్‌పై ప్రభుత్వం, పోలీస్ డిపార్ట్‌మెంట్ కీలక ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ఇక ఈ పరిణామాల నేపథ్యంలో, రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటించిన గేమ్‌చేంజర్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ AMB సినిమాస్‌లో మంగళవారం జరిగింది. కానీ, గత ఈవెంట్స్‌తో పోలిస్తే, ఈసారి సీన్ పూర్తిగా వేరుగా కనిపించింది. ఫ్లెక్సీలు, హోర్డింగులు లేకుండా ఈవెంట్ నిర్వహించబడింది.
AMB సినిమాస్ ఎంట్రీ దగ్గర పోలీసులు, బౌన్సర్లు అలర్ట్‌గా నిలిచి, కేవలం టికెట్ ఉన్న వారికే ప్రవేశం కల్పించారు. ఇది మాత్రం సందర్శకుల మధ్య చర్చనీయాంశమైంది. పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ కానున్న భారీ సినిమాకు సంబంధించిన ఈవెంట్ అయినప్పటికీ, ఈసారి అభిమానుల హడావుడి లేకుండా పూర్తిగా నియంత్రణలో ఈవెంట్ జరిగింది. థియేటర్ చుట్టూ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.
సంధ్య థియేటర్ తొక్కిసలాటలో ఒక మహిళ మరణించడం అలాగే బాలుడు తీవ్ర అస్వస్థతకు గురవ్వడం టాలీవుడ్ ను షాక్ కి గురి చేసింది. ఆ ఘటన వలన అల్లు అర్జున్ అరెస్ట్ నేపథ్యంలో నిర్మాతల మండలి కూడా పూర్తిగా అప్రమత్తమైంది. గతంలో మల్టీప్లెక్స్‌లు, థియేటర్ల వద్ద నిర్వహించిన కార్యక్రమాల్లో భద్రత పట్ల శ్రద్ధ తీసుకోకపోవడం వల్లనే సంక్షోభాలు తలెత్తాయని సినీ పరిశ్రమ అంగీకరించింది.
ఈ కారణంగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా మల్టీప్లెక్స్‌లు, థియేటర్ల యాజమాన్యాలు బందోబస్తు ఏర్పాట్లతో ముందుకెళ్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం, పోలీసు విభాగం కఠిన ఆంక్షల కారణంగా, టాలీవుడ్‌లో ఈవెంట్ల నిర్వహణలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. అభిమానుల తాకిడి ఉన్నప్పటికీ, కేవలం ఆహ్వానితులకు మాత్రమే ప్రవేశం కల్పించడం, అన్ని అంశాలను నియంత్రణలో ఉంచడం వంటి చర్యలు పరిశ్రమలో కొత్త ధోరణి మొదలుపెట్టాయి.
గేమ్‌చేంజర్ ఈవెంట్ నిర్వహణలో పాటించిన నిబంధనలు మిగతా ఈవెంట్లకు కూడా ఆదర్శంగా నిలిచే అవకాశం ఉందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఇక గేమ్ ఛేంజర్ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో వరల్డ్ వైడ్ గా విడుదల కానున్న ఈ సినిమాపై ఇప్పటికే మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ట్రైలర్ తో ఆ అంచనాల స్థాయి ఇంకా ఎంత పెరిగుతుందో చూడాలి.