మార్కో.. ఏదో మ్యాజిక్ చేసేలా ఉంది

అయితే 8వ రోజే ఈ చిత్రానికి హిందీలో ఏకంగా 25 లక్షలు వచ్చాయంట. ఇక 9వ రోజు అయితే 50 లక్షల గ్రాస్ వరకు వసూళ్లు అయ్యింది.

Update: 2024-12-30 14:39 GMT

ఉన్ని ముకుందన్ హీరోగా మలయాళంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ 'మార్కో' బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకొని రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ దిశగా దూసుకుపోతోంది. మలయాళం, హిందీ భాషలో కూడా ఏకకాలంలో ఈ చిత్రం రిలీజ్ అయ్యింది. మొదటి రోజు మొదటి ఆటతోనే ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చింది.

హిందీలో ఈ ఏడాది రిలీజ్ అయిన కిల్ మూవీ ఎలా అయితే బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో 'మార్కో' కూడా కంప్లీట్ వైలెంట్ స్టోరీతో అందరికి చేరువ అయ్యింది. ఈ నేపథ్యంలోనే హిందీలో మెల్లగా ఈ సినిమా పిక్ అప్ అవుతోంది. మొదటి రోజు హిందీలో కేవలం 70 షోలలో మాత్రమే మార్కో ప్రదర్శితం అయ్యింది. అలాగే కేవలం లక్షరూపాయిలు మాత్రమే కలెక్షన్స్ వచ్చాయి.

అయితే మొదటి వారం కంప్లీట్ అయిన తర్వాత ఈ సినిమా 281 షోలకి చేరుకుంది. ఇక 9వ రోజు ఈ సినిమాకి 450 షోలు పడ్డాయి. దీనిని బట్టి ఈ సినిమా మూవీకి ఏ రేంజ్ ఆదరణ వస్తుందో చెప్పొచ్చు. అలాగే ఈ మూవీ కలెక్షన్స్ కూడా రోజు రోజుకి పెరుగుతూ ఉన్నాయి. మొదటి వారం ఈ చిత్రం 28 లక్షలు హిందీలో వసూళ్లు చేసింది.

అయితే 8వ రోజే ఈ చిత్రానికి హిందీలో ఏకంగా 25 లక్షలు వచ్చాయంట. ఇక 9వ రోజు అయితే 50 లక్షల గ్రాస్ వరకు వసూళ్లు అయ్యింది. దీనిని బట్టి ఈ సినిమాకి హిందీలో ఎలాంటి ఆదరణ లభిస్తుందో అర్ధం చేసుకోవచ్చు. మున్ముందు కలెక్షన్స్ మరింత పెరుగుతాయని అనుకుంటున్నారు. ప్రస్తుతం థియేటర్స్ లో 'పుష్ప 2' సందడి చాలా వరకు తగ్గిపోయింది.

'బేబీ జాన్' మూవీ డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలోనే ఉన్న స్పేస్ ని 'మార్కో' మూవీ కరెక్ట్ గా ఉపయోగించుకుంది. మౌత్ టాక్ ఈ సినిమాకి ఆడియన్స్ రెస్పాన్స్ కూడా పెరుగుతోంది. ఇదే మొదటి సారి ఒక మలయాళం మూవీ హిందీ ఆడియన్స్ ని బాగా ఎట్రాక్ట్ చేసి మంచి కలెక్షన్స్ దిశగా అడుగులు వేస్తోంది.

ఉన్ని ముకుందన్ కెరియర్ లో కూడా బెస్ట్ మూవీగా ఈ చిత్రం నిలిచింది. ఇదిలా ఉంటే భారీ మలయాళంలో ఈ చిత్రం ఏ ఏడాది హైయెస్ట్ కలెక్షన్స్ అందుకునే అవకాశం ఉందనే ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఇక ఈ చిత్రం తెలుగులో కూడా రిలీజ్ కి రెడీ అవుతోంది. రీసెంట్ గా ఈ మూవీ తెలుగు ట్రైలర్ ప్రేక్షకుల ముందుకొచ్చింది.

Tags:    

Similar News