గత కొన్ని నెలలుగా బాలీవుడ్ బాక్సాఫీస్ పై మన సినిమాలు దండయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. డబ్బింగ్ వెర్షన్ లో విడుదలవుతున్న మన సినిమాలకు ఉత్తరాది ప్రేక్షకులు గత కొన్నినెలలుగా బ్రహ్మరథం పడుతున్నారు. దీంతో ఉత్తరాదిలో మన సినిమాలకు కాసుల వర్షం కురుస్తోంది. హిందీ సినిమాలకు మించి మన దక్షిణాది మూవీస్ కి పట్టడం కడుతుండటంతో అక్కడి మార్కెట్ లో మన సినిమాలు రికార్డు స్థాయి వసూళ్లని రాబడుతున్నాయి.
గత ఏడాది డిసెంబర్ లో విడుదలైన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ `పుష్ప` హిందీ బెల్ట్ లో ఊహించని విధంగా భారీ వసూళ్లని రాబట్టి సంచలనం సృష్టించింది. ఇక ఆ తరువాత భారీ స్థాయిలో విడుదలైన ట్రిపుల్ ఆర్ కూడా అంతకు మించిన స్థాయిలో బాక్సాఫీస్ ని కొల్లగొట్టింది.
300 కోట్లకు పైచిలుకు వసూళ్లని ఒక్క హిందీ బెల్ట్ లోనే రాబట్టడం విశేషం. రామ్ చరణ్, ఎన్టీఆర్ ల కలయికలో రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా 1150 కోట్లకు మించి వసూళ్లని రాబట్టింది.
ఇదే ఊపులో ఏప్రిల్ 14న విడుదలైన `కేజీఎఫ్ 2` దేశ వ్యాప్తంగా ప్రభంజనాన్ని సృష్టించింది. రికార్డు స్థాయి వసూళ్లని రాబట్టింది. హిందీ బెల్ట్ లో ఈ మూవీ ఏకంగా 420 కోట్లకు మించి వసూళ్లని రాబట్టి అక్కడ చరిత్ర సృష్టించింది. దీంతో బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు కేజీఎఫ్ 2 వసూళ్లని చూసి షాకయ్యారు. దీంతో ఈ సినిమా తరువాత దక్షిణాది నుంచి సినిమా రిలీజ్ అవుతోందంటే బాలీవుడ్ లో భయం మొదలౌతోంది. మళ్లీ ఏ సినిమా రిలీజ్ అవుతుందో ఏ స్థాయిలో వసూళ్లని రాబట్టి బాలీవుడ్ కు షాకిస్తుందో అని ఆశ్చర్యంతో చూస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఈ శుక్రవారం వరల్డ్ వైడ్ గా విడుదలవుతున్న `మేజర్` మూవీ పై ఇప్పడు బాలీవుడ్ వర్గాలు దృష్టిపెట్టాయి. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ముంబై తాజ్ హోటల్ మారణహోమం నేపథ్యంలో రూపొందిన సినిమా కావడంతో దేశ వ్యాప్తంగా ఈ మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇటీవల ఈ మూవీ ప్రీమియర్ లకి నార్త్ లో అద్భుతమైన స్పందన లభించింది. దీంతో నార్త్ లో మరీ ముఖ్యంగా బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ సంచలనాలు సృష్టించడం ఖాయం అని చెబుతున్నారు.
ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ అదరిపోయాయి. సినిమాని కూడా ప్రత్యేకంగా చూస్తున్నారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో `మేజర్` రికార్డు స్థాయి ఓపెనింగ్స్ ని రాబట్టడం ఖాయంగా కనిపిస్తోంది.