అందరి దృష్టి మెగా స్పీచ్ పైనే

Update: 2018-12-26 08:03 GMT
ఈ సంక్రాంతికి రిలీజ్ కానున్న సినిమాల్లో ఇప్పటికే ఎన్టీఆర్ బయోపిక్ మేకర్స్ భారీ పబ్లిసిటీతో.. హైప్ క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యారు.  కానీ ఈ విషయంలో రామ్ చరణ్ 'వినయ విధేయ రామ'.. వరుణ్ తేజ్-వెంకటెష్ మల్టిస్టారర్ 'ఎఫ్2' సినిమాలు కాస్త వెనకబడే ఉన్నాయి.  ఇక ఈ రెండు సినిమాలలో కూడా 'ఎఫ్2' కామెడీ ఎంటర్ టైనర్ కావడంతో ప్రేక్షకులు ఆసక్తి చూపించే అవకాశం ఉంది.  కానీ 'వినయ విధేయ రామ' బోయపాటి స్టైల్ రొటీన్ మాస్ సినిమాలా టైపులో కనిపిస్తుండడంతో హైప్ ఎక్కువగా లేదు.

సినిమా విడుదలకు ఇక పదిహేను రోజులు మాత్రమే సమయం ఉంది కాబట్టి ప్రమోషన్స్ విషయంలో ఇకపై జోరు పెంచుతారేమో వేచి చూడాలి. ఇదిలా ఉంటే గురువారం నాడు యూసుఫ్ గూడలో జరగనున్న ప్రీ-రిలీజ్ ఈవెంట్ కోసం అభిమానులు ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరు అవుతున్నాడు.  చిరంజీవి సహజంగా ఇలాంటి వేడుకలలో ఇచ్చే స్పీచ్ ని బట్టి సినిమా ఎలా ఉండబోతుందో అంచనాకు వచ్చేస్తారు అభిమానులు. చిరంజీవి జడ్జిమెంట్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే.  సినిమా రిజల్ట్ ను ముందే ఖచ్చితంగా ఊహించడంలో చిరు ఒక స్పెషలిస్ట్. సినిమా ఒకవేళ హిట్ అనిపిస్తే ఆ విషయం హింట్ ఇస్తారు లేదంటే అల్ ది బెస్ట్ చెప్పి ఊరుకుంటారు. చిరు హిట్ అని చెప్పిన తర్వాత ఫ్లాప్ అయిన సినిమాలు చాలా తక్కువ అందుకే  అందరి దృష్టి  చిరు ఇవ్వబోయే స్పీచ్ పైనే ఉంది.

అదొక్కటే కాకుండా రేపు ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనే 'వినయ విధేయ రామ' ట్రైలర్ ను కూడా రిలీజ్ చేస్తున్నారు. టీజర్ లో పెద్దగా స్టొరీ రివీల్ చెయ్యలేదు కానీ ట్రైలర్ ను బట్టి సినిమా ఎలా ఉండబోతోందో మనకు సాంపిల్ తెలిసిపోతుందిగా.
Tags:    

Similar News