#చై సామ్.. 30ప్లస్ డే.. సస్పెన్స్ కి తెర వీడేదెపుడు? కాలం గడిచేకొద్దీ సస్పెన్స్ పెరుగుతోందే కానీ తగ్గడం లేదు. అభిమానులు ఈ జంట నుంచి ఏదో ఒక స్పష్ఠమైన సమాధానం ఆశిస్తున్నారు. కానీ చై నుంచి కానీ సామ్ నుంచి కానీ సోషల్ మీడియా వేదికలపై ఎదురవుతున్న ప్రశ్నలకు ఎలాంటి సమాధానాలు లేవు.
సమంత అక్కినేని నుంచి అక్కినేని లేకపోవడం `ఎస్` అనే సింగిల్ డిజిట్ తో ఉన్నట్టుండి సోషల్ మీడియా పేజీ డ్రైగా కనిపించడంతో అభిమానులంతా ఒక్కసారిగా షాక్ తిన్నారు. దీనిపై ఓ ఇంటర్వ్యూవర్ అడిగిన ప్రశ్నకు సామ్ నుంచి సరైన సమాధానం లేదు. దానిపై ఇప్పుడే స్పందించనని .. ప్రజలు కోరినప్పుడు సమయం వచ్చినప్పుడు నేను సమాధానం చెబుతానని సామ్ అనడంతో సందేహాలు మరికాస్త పెద్దవయ్యాయి. రోజులు గడిచేకొద్దీ సామ్ -చైతన్య మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయన్న పుకార్లు మరింత తీవ్రతరమవుతున్నాయి. సమంత వంటి సోషల్ మీడియా క్వీన్ విచిత్రంగా ఇంకా నిశ్శబ్దం కొనసాగించడంతో అగ్నికి ఆజ్యం పోసిన చందంగా మారింది.
అయితే ప్రజల అన్ని సందేహాలకు సమాధానమిచ్చే కీలకమైన డేట్ రానుంది. అక్టోబర్ 6న #చై సామ్ జంట తమ 4వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకోబోతున్నారు. ఈ జంట 2017 లో ఈ డేట్ కి పెళ్లాడారు. అంగరంగ వైభవంగా డెస్టినేషన్ తరహాలో ఈ పెళ్లి జరిగింది. వివాహ వార్షికోత్సవం సమీపిస్తున్నందున ఆరోజు సమంత లేదా చైతన్య ఏదో ఒక క్లారిటీనిచ్చేందుకు సోషల్ మీడియాల్లోకి వెళ్లాల్సి ఉంటుంది. లేదా సంయుక్తంగా ఆ ఇద్దరూ మీడియా ముఖంగా అన్నిటికీ సమాధానాలివ్వాల్సి ఉంటుందని భావిస్తున్నారు. ఏది ఏమైనా నేటి సస్పెన్స్ కి సాధ్యమైనంత తొందరలోనే తెర దించుతారనే అభిమానులు ఆశిస్తున్నారు. ఇప్పటివరకూ నెటిజనులు చేసిన ఊహాగానాలన్నీ నిజాలు కావని నిరూపిస్తారనే అక్కినేని అభిమానులు వేచి చూస్తున్నారు. ఇన్నాళ్లు ఇన్ స్టా పేజీలు ట్విట్టర్ టైమ్ లైన్ లో వస్తున్న అనేక పోస్ట్ లపై సమంత మౌనాన్ని ఆశ్రయించడాన్ని అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. సమయం వచ్చినప్పుడు మాత్రమే స్పందిస్తానని చెప్పడాన్ని అస్సలు జీర్ణించుకోలేని పరిస్థితి ఉంది. కచ్ఛితంగా వివాహ వార్షికోత్సవం వేళ.. అభిమానులు తమ అన్ని సందేహాలకు సమాధానాలు వెతుక్కుంటున్నారు. ప్రస్తుతానికి అక్టోబర్ 6 బిగ్ డే గా మారింది.