కొందరు దర్శకులు సినిమాలు తెరకెక్కించడం లోనే కాదు.. హీరోయిన్లలోని స్పార్క్ ను గమనించడంలో స్పెషలిస్టులు. ఉదాహరణకు పూరి జగన్నాధ్ ను తీసుకుందాం. అయన ఇప్పుడు ఉప్పు కారం లేని చప్పగా ఉండే సినిమాలు తీస్తున్నాడనేది నిజమే. కానీ ఆయన 'లోఫర్' సినిమాతో దిశా పటాని ని పరిచయం చేసినప్పుడు జనాలు ఆయన సెలెక్షన్ ను సీరియస్ గా తీసుకోలేదు. అదే ఇప్పుడు చూడండి.. ఇన్నర్ బ్యూటీగా మారి స్లో మోషన్ లో బాలీవుడ్ కు మంటెట్టింది. మరి ఈ ఇన్నర్ టాలెంటును ఆయన గమనించే కదా 'లోఫర్' ఛాన్స్ ఇచ్చింది. అలాగే డైరెక్టర్ విక్రమ్ కుమార్ సెలెక్షన్ కూడా సూపర్ గా ఉంటుందని చాలామంది హీరోలకు గురి ఉందట.
విక్రమ్ ప్రస్తుతం న్యాచురల్ స్టార్ నాని హీరోగా 'గ్యాంగ్ లీడర్' అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో నాని సరసన ప్రియాంక మోహన్ అనే చెన్నై భామ హీరోయిన్ గా నటిస్తోందట. అదే ప్రియాంక కు డెబ్యూ ఫిలిం. కానీ విక్రమ్ ప్రియాంక ను ఇంకా మీడియాకు దూరంగా ఉంచాడు. అసలు ప్రియాంక ఈ సినిమాలో నటిస్తుందని కూడా వెల్లడించలేదు. కానీ ఇండస్ట్రీలో ఉండే కుర్ర హీరోలకు ఈ విషయం తెలిసి ఈ ప్రియాంక గురించి ఎంక్వైరీలు మొదలు పెట్టారట. అయితే ప్రియాంక 'గ్యాంగ్ లీడర్' రిలీజ్ అయ్యేవరకూ వేరే సినిమాలో హీరోయిన్ గా నటించేందుకు వీలు లేకుండా విక్రమ్ కండిషన్ పెట్టాడట.
అందుకే యంగ్ హీరోల బ్యాచ్ ఎవరికీ ఈ హీరోయిన్ ను సైన్ చేసే అవకాశం లేకుండాపోయింది. 'గ్యాంగ్ లీడర్' రిలీజ్ అయితే కానీ మనకు ఈ ప్రియాంక మోహన్ సంగతి ఏంటో తెలియదు. గ్యాంగ్ లీడర్ సినిమా రిలీజ్ కాకముందే ప్రియాంకకు ఇంత డిమాండ్ ఉందంటే.. సినిమా రిలీజ్ అయి హిట్ అయితే క్రేజ్ మరింతగా పెరగడం ఖాయమేమో.