రాజ‌మౌళి కావాలి.. కొంచెం చూస్తారా?

Update: 2017-05-09 17:54 GMT
ఇప్పుడు ఇండియాలోమోస్ట్ వాంటెడ్ డైరెక్ట‌ర్ ఎవ‌రు అంటే మ‌రో మాట లేకుండా ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి పేరు చెప్పేయొచ్చు. ‘బాహుబ‌లి’తో అత‌డికొచ్చిన పేరు అంతా ఇంతా కాదు. దేశ‌మంతా ఈ ద‌ర్శ‌క ధీరుడి గురించే చ‌ర్చించుకుంటోంది. అత‌డితో సినిమా చేయాల‌ని న‌టీనటులు.. టెక్నీషియ‌న్లు.. నిర్మాత‌లు త‌హ‌త‌హ‌లాడిపోతున్నారు. త‌న త‌ర్వాతి సినిమా ఏదో జ‌క్క‌న్న ఇంకా తేల్చ‌ని నేప‌థ్యంలో ఆ అవ‌కాశం తామే ద‌క్కించుకోవాల‌ని చాలామంది ప్ర‌య‌త్నిస్తున్నారు. బాలీవుడ్ నుంచి కూడా రాజ‌మౌళికి ఆఫ‌ర్లు వ‌స్తున్న‌ప్ప‌టికీ ప్రాథ‌మికంగా తెలుగు సినిమానే చేయాల‌ని రాజ‌మౌళి భావిస్తున్న‌ట్లు తెలుస్తుండ‌టంతో అత‌డితో జ‌ట్టు క‌ట్టేందుకు హీరోలు.. నిర్మాత‌లు త‌మ‌వంతు ప్ర‌య‌త్నాలు చేస్త‌న్నారు.

ప్ర‌స్తుతం రాజ‌మౌళి భూటాన్ లో హాలిడే ఎంజాయ్ చేస్తుండ‌గా.. ఇక్క‌డ రాజ‌మౌళి కుటుంబీకుల‌తో సంప్ర‌దింపులు జ‌రుపుతున్నార‌ట హీరోలు.. ద‌ర్శ‌కులు. రాజ‌మౌళితో త‌న నాలుగో సినిమా చేయాల‌ని చాలా ఏళ్లుగా ప్ర‌య‌త్నిస్తున్నాడు జూనియ‌ర్ ఎన్టీఆర్. కానీ కుద‌ర‌ట్లేదు. ఐతే ఈసారి ఎట్టి ప‌రిస్థితుల్లోనూ రాజ‌మౌళిని త‌నతో సినిమా చేసేందుకు ఒప్పించాల‌ని చూస్తున్నాడ‌ట తార‌క్. ‘జై ల‌వ‌కుశ’ ముగియ‌గానే అందుబాటులోకి వ‌స్తానంటూ రాజ‌మౌళి ఫ్యామిలీకి స‌మాచారం ఇచ్చాడ‌ట‌. మ‌రోవైపు త‌న చిన్న కొడుకు అఖిల్ ను రాజ‌మౌళికి అప్ప‌గించాల‌ని చూస్తున్నాడు నాగార్జున‌. ఇంకా మ‌రికొంద‌రు స్టార్లు కూడా విజ‌యేంద్ర ప్ర‌సాద్.. కీర‌వాణి లాంటి వాళ్ల ద్వారా లాబీయింగ్ న‌డుపుతున్న‌ట్లు స‌మాచారం. ఈసారి మ‌ర్యాద‌రామ‌న్న.. ఈగ త‌ర‌హాలో స్టార్లు లేని సినిమా చేస్తాడేమో అని.. నాని లాంటి హీరోలు కూడా రాజ‌మౌళి సినిమాపై ఆశ‌తో ఉన్నారు. మ‌రోవైపు డీవీవీ దాన‌య్య‌.. కేఎల్ నారాయ‌ణ‌.. క‌ర‌ణ్ జోహార్.. సాయి కొర్ర‌పాటి లాంటి నిర్మాత‌లు రాజ‌మౌళి సినిమాను ప్రొడ్యూస్ చేయాల‌ని చూస్తున్నారు. మ‌రి వీరిలో జ‌క్క‌న్న ఎవ‌రికి ఛాన్సిస్తాడో చూడాలి.
Tags:    

Similar News