ఏడెనిమిది నెలలుగా కరోనా మహమ్మారీ సెలబ్రిటీలను ఇండ్లలో లాక్ చేసిన సంగతి తెలిసిందే. ఎటూ పోలేక నానా తంటాలు పడ్డారు. రిలాక్స్ అవ్వడానికి చిలౌట్ అవ్వడానికి ఏమాత్రం అవకాశం చిక్కలేదు. దీంతో కట్ట తెగిన వరదలా చిన్నపాటి రిలీఫ్ దొరగ్గానే సెలబ్రిటీలంతా పొలోమని మాల్దీవుల విహారానికి పయనమయ్యారు.
సమంతా- రకుల్ ప్రీత్ సింగ్- కాజల్ అగర్వాల్- నేహా ధూపియా- దిషా పటాని- తారా సుతారియా- మలైకా- మందిరా బేడి,- తాప్సీ పన్నూ- మౌని రాయ్ ఇటీవల మాల్దీవులలో సెలబ్రేషన్ చేసుకున్నారు. టైగర్ ష్రాఫ్, వరుణ్ ధావన్.. అంగద్ భేడీ తదితరులు కూడా మాల్దీవుల విహారంలో చిలౌట్ చేశారు. అయితే అక్కడికే వెళ్లాల్సిన అవసరం ఏమిటి? అంటే..
సహజమైన సుందరమైన బీచ్ లు.. విలాసవంతమైన రిసార్ట్ లు మాల్దీవుల్లో చిరస్మరణీయమైన బస కోసం రెడీగా ఉంటాయి. మాల్దీవులు భారతదేశంలో చాలా మందికి కలల టార్గెట్. ప్రజలు తరచుగా మాల్దీవులను తమ హనీమూన్ గమ్యస్థానంగా ఎంచుకుంటారు. మహమ్మారి ఆంక్షలు తగ్గినప్పటి నుండి ప్రముఖులు మాల్దీవులను ఎంచుకోవడానికి కారణమిదే. కొందరు స్నేహితులతో, మరికొందరు కుటుంబ సభ్యులతో మాల్దీవుల్లో సెలబ్రేట్ చేయడానికి ఇష్టపడుతున్నారు. కొత్తగా వివాహం చేసుకున్న జంట కాజల్ అగర్వాల్ గౌతమ్ కిచ్లు హనీమూన్ కోసం మాల్దీవులను ఎంచుకున్నారు. ఈ జంట మాల్దీవులలో ఒక వారం పాటు గడిపారు. ప్రస్తుతం చైతన్య- సమంత జంట మాల్దీవుల విహారంలో ఉంది. తారా సుతారియా - ఆధార్ జైన్ జోడీ మాల్దీవులలో బస చేశారు. తారా సుతారియా ఇటీవల తన పుట్టినరోజును మాల్దీవుల్లో జరుపుకుంది. దిషా పటాని ప్రస్తుతం తన బాయ్‌ఫ్రెండ్ టైగర్ ష్రాఫ్‌తో కలిసి మాల్దీవుల్లో ఉన్నారు. టైగర్‌తో పాటు, అతని సోదరి కృష్ణ ష్రాఫ్ కూడా మాల్దీవుల్లో ఉన్నారు. మందిరా బేడి, మౌని రాయ్ కూడా ఇటీవల మాల్దీవుల్లో గొప్ప సమయం గడిపారు.
ఎక్కువ మంది పర్యాటకులను ఆకర్షించడానికి మాల్దీవుల పర్యాటక పరిశ్రమ సెలబ్రిటీలకు ప్రత్యేక ప్యాకేజీలను ఇస్తోంది. మాల్దీవుల పర్యాటక విభాగం కూడా రాయితీ ధరలను అందించడం.. ప్రత్యేక ప్యాకేజీలను అందించడం ద్వారా పర్యాటకాన్ని ప్రోత్సహిస్తోంది.