కాజల్ అగర్వాల్ రీ ఎంట్రీకి అన్ని కోట్లా?

Update: 2022-07-13 02:30 GMT
టాలీవుడ్ చందమామగా తన కంటూ ఒక ప్రత్యేకమైన స్టార్ ఇమేజ్ ను సంపాదించుకున్న కాజల్ అగర్వాల్ ఇటీవల ఒక పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. పెళ్లి తర్వాత కూడా అలానే సినిమాలు చేసుకుంటూ కాస్త బిజీ గా కనిపించిన కాజల్ అగర్వాల్ గత ఏడాది ప్రెగ్నెన్సీ వార్తలతో ఒక్కసారిగా అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. ఒక వైపు సినిమాలు చేసుకుంటూనే మరొక వైపు తన ఫ్యామిలీ బాధ్యతను కూడా తీసుకుంది.

మగ బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత తల్లిగా ఇంట్లోనే ఒక సరికొత్త లైఫ్ ను ఆమె ఎంజాయ్ చేస్తోంది. అయితే త్వరలోనే కాజల్ అగర్వాల్ మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఆమెకు ఆఫర్లు కూడా చాలానే ఉన్నాయి. కానీ కాజల్ అగర్వాల్ పారితోషికానికి ఆశపడకుండా డిఫరెంట్ గా ఉండే క్యారెక్టర్స్ చేయాలని అనుకుంటోందట. ఇక అందులో కొన్ని వెబ్ సిరీస్ ఆఫర్స్ కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది.

ఓటీటీ ప్లాట్ ఫామ్ లో కాజల్ అగర్వాల్ ఇదివరకే ఒక వెబ్ సిరీస్ చేసింది. హాట్ స్టార్ లో కాజల్ అగర్వాల్ లైవ్ టెలికాస్ట్ అనే ఒక హారర్ వెబ్ సిరీస్ చేసింది. అది దారుణంగా డిజాస్టర్ అయింది. అయినప్పటికీ ప్రస్తుతం మంచి ఆఫర్లు వస్తున్నాయి.

ఇటీవల హాట్ స్టార్ నుంచి మరో కూడా వచ్చినట్లు సమాచారం. అయితే ఆ వెబ్ సిరీస్ లో నటించడానికి కాజల్ అగర్వాల్ కు దాదాపు మూడు కోట్లకు పైగానే పారితోషికం కూడా ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది.

చాలా తక్కువ డేట్స్ ఇచ్చిన కాజల్ అగర్వాల్ ఒక విధంగా ఆదాయపరంగా లాభం వచ్చే విధంగానే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్. ఇక చివరగా కాజల్ అగర్వాల్ ఆచార్య సినిమాలో నటించినప్పటికీ చిత్ర యూనిట్ సభ్యులు ఆమె పాత్ర అవసరం లేదు అని తొలగించేశారు.

అయినప్పటికీ కూడా కాజల్ అగర్వాల్ ఆ విషయం గురించి పెద్దగా పట్టించుకోకుండా ఫ్రెండ్లీ గా తీసుకుంది. ఇక తల్లయిన తర్వాత కాజల్ అగర్వాల్ వెండితెరపై ఎలాంటి పాత్రలతో రీఎంట్రీ ఇస్తుందో చూడాలి.
Tags:    

Similar News