చరణ్‌ అనుకుంటే రంగంలోకి వెంకీ

Update: 2019-10-24 17:10 GMT
తమిళంలో ఇటీవల విడుదలైన 'అసురన్‌' చిత్రం భారీ బ్లాక్‌ బస్టర్‌ సక్సెస్‌ ను దక్కించుకుంది. ధనుష్‌ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పటి వరకు 150 కోట్ల వసూళ్లను రాబట్టింది. ధనుష్‌ కెరీర్‌ లో ఇదే బిగ్గెస్ట్‌ సక్సెస్‌ మూవీ అన్నట్లుగా తమిళ మీడియాలో కథనాలు వస్తున్నాయి. కమర్షియల్‌ గా సక్సెస్‌ దక్కించుకోవడంతో పాటు నటుడిగా ధనుష్‌ మంచి మార్కులు కొట్టేశాడు. వెట్రిమాన్‌ దర్శకత్వంలో వచ్చిన 'అసురన్‌' చిత్రాన్ని తెలుగులో రీమేక్‌ చేయబోతున్నట్లుగా ఇటీవలే వార్తలు వచ్చాయి.

రామ్‌ చరణ్‌ ఈ సినిమాను చూసి తన సన్నిహితులతో రీమేక్‌ రైట్స్‌ ను కొనుగోలు చేయించాడని.. రీమేక్‌ చేయాలనే ఆసక్తితో ఉన్నాడు అంటూ ప్రచారం జరిగింది. కాని తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం అసురన్‌ పై ఆసక్తి చూపిస్తున్నది రామ్‌ చరణ్‌ కాదు వెంకటేష్‌. ప్రముఖ నిర్మాత సురేష్‌ బాబు తెలుగులో అసురన్‌ ను రీమేక్‌ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాడట. తమిళంలో నిర్మించిన కళైపులి ఎస్‌ థానుతో కలిసి తెలుగులో సినిమాను నిర్మించబోతున్నాడట.

ఈమద్య కాలంలో సురేష్‌ బాబు లెక్కకు మించి సినిమాలు నిర్మిస్తున్నాడు. ఇప్పుడు ఈ రీమేక్‌ ను కూడా నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాడట. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం వెట్రిమారన్‌ కే తెలుగు రీమేక్‌ డైరెక్షన్‌ ఛాన్స్‌ ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని సమాచారం అందుతోంది. మొత్తానికి అసురన్‌ గా వెంకీ చేయబోతున్నాడనే వార్తలు ప్రస్తుతం సినీ వర్గాల్లో చాలా ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఈ విషయమై అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది. వెంకీమామ చిత్రం తర్వాత వెంకటేష్‌ చేసే సినిమాపై క్లారిటీ రాలేదు. ఈ వార్తలు నిజం అయితే వెంకీ తదుపరి చిత్రం అసురన్‌ రీమేక్‌ అవుతుందేమో చూడాలి.
Tags:    

Similar News