మోహన్‌బాబు మళ్లీ తెరపై అల్లరి చేయబోతున్నాడు. కాకపోతే ఇదివరకు ఆయన మొగుడుగానే అల్లరి చేశాడు. ఈసారి మాత్రం మామగా అల్లరి చేయబోతున్నాడు. మరి అల్లరి మామకి అల్లుడుగా నటించేది ఎవరంటారా? అల్లరిని తన ఇంటి పేరుగా మార్చుకొన్న నరేష్ మోహన్‌బాబుకి అల్లుడుగా కనిపించబోతున్నాడు. అంటే అల్లరి ప్లస్ అల్లరి అన్నమాట. శ్రీనివాసరెడ్డి దర్శకత్వంలో రూపొందనున్న ఈ కాంబినేషన్ చిత్రానికి `మామ మంచు... అల్లుడు కంచు` అనే పేరును ఫిక్స్ చేశారు. ఈ సినిమాలో మోహన్ బాబుకి జోడీగా రమ్యకృష్ణ, మీనా నటిస్తున్నారు. 'అల్లరి మొగుడు` కాంబినేషన్లో 23 ఏళ్ల తర్వాత వస్తున్న చిత్రమిది. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై మంచు విష్ణు నిర్మిస్తున్నారు.
ఈ చిత్రానికి అచ్చు, బప్పా లహరి, రఘు కుంచె పాటలు స్వరపరుస్తున్నారు. ఇప్పటికే రెండు పాటల రికార్డింగ్ పూర్తయ్యింది. త్వరలోనే చిత్రాన్ని సెట్స్‌పైకి తీసుకెళ్లబోతున్నారు. మోహన్‌బాబు `పాండవులు పాండవులు తుమ్మెద` నుంచి పూర్తిస్థాయిలో నటనపై దృష్టిపెట్టారు. ఇకపై ఆయన వరుసగా సినిమాలు చేయాలని నిర్ణయించుకొన్నారు. తనకు తగ్గ కథల్ని ఇతర భాషల నుంచి తీసుకొచ్చైనా సరే... విరామం లేకుండా సినిమాలు చేయాలని మోహన్‌బాబు నిర్ణయించుకొన్నారు. `మామ మంచు... అల్లుడు కంచు` చిత్రం కూడా ఓ మరాఠీ సినిమా ఆధారంగా తెరకెక్కుతోందని సమాచారం.