దయ్యమంటే భయం లేనోడు ఆ రోజు వస్తాడు

Update: 2016-10-11 09:30 GMT
‘సుడిగాడు’ తర్వాత హిట్టు కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నాడు అల్లరి నరేష్. కానీ అతడి ప్రయత్నాలు ఫలించట్లేదు. నరేష్ చివరి సినిమా ‘సెల్ఫీ రాజా’ కూడా అతడికి నిరాశనే మిగిల్చింది. ఇప్పుడు అతడి ఆశలన్నీ ‘ఇంట్లో దయ్యం.. నాకేం భయం’ మీదే ఉన్నాయి. ఇంతకుముందు నరేష్ తో సీమశాస్త్రి.. సీమ టపాకాయ్ లాంటి సక్సెస్ ఫుల్ సినిమాలు అందించిన నాగేశ్వరరెడ్డి దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. ఆల్రెడీ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు మంచి ముహూర్తం కోసం చూస్తోంది. దసరా రిలీజ్ అనుకున్నా.. అప్పటికి హడావుడి అవుతుందని.. పైగా పోటీ కూడా ఎక్కువుందని వాయిదా వేశారు.

ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ డేట్ ఖరారు చేశారు. నవంబరు 11న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. భారీ చిత్రాలకు పెట్టి పేరరైన బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండటం విశేషం. కృతిక జయకుమార్ హీరోయిన్‌ గా నటిస్తున్న ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్.. పోసాని కృష్ణమురళి.. శ్రీనివాసరెడ్డి.. షకలక శంకర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇది నాగేశ్వరరెడ్డి తరహాలో సాగే కామెడీ ఎంటర్టైనర్. నరేష్.. నాగేశ్వరరెడ్డి హార్రర్ కామెడీ చేస్తుండటం ఇదే తొలిసారి. నవంబరు 11న ఆల్రెడీ నిఖిల్ సినిమా ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ రిలీజవుతోంది. రెండూ మీడియం రేంజి సినిమాలే కాబట్టి ఇబ్బంది లేదు. మరి నాగేశ్వరరెడ్డి అయినా.. అల్లరోడికి హిట్టు ప్రసాదిస్తాడేమో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News