దెయ్యం ఎప్పుడొస్తుందో హీరోకి తెలియదట

Update: 2016-11-18 09:36 GMT
కామెడీ హీరోల్లో స్టార్ గా ఎదిగిన నటుడు అల్లరి నరేష్. ఇప్పుడు కాస్త ఇబ్బందులు పడుతున్నాడు కానీ.. సరైన సినిమా పడితే తన రేంజ్ ను తిరిగి అందుకోవడం ఖాయమే. ఆ సరైన సినిమా 'ఇంట్లో దెయ్యం నాకేం భయం' అవుతుందని బోలెడన్ని ఆశలు పెట్టుకున్న అల్లరి నరేష్ కు.. రిలీజ్ వాయిదా పడిపోవడం నిరుత్సాహం కలిగించింది.

ఆశించిన మేరకు.. చేసిన ఖర్చు వరకు కూడా బిజినెస్ జరక్కపోయినా.. నవంబర్ 13న ఇంట్లోదెయ్యం నాకేం భయంను రిలీజ్ చేసేయాలని నిర్మాతబి వీ ఎస్ ఎన్ ప్రసాద్  ఫిక్స్ అయ్యాడు. అయితే.. సరిగ్గా విడుదలకు నాలుగు రోజుల ముందు పెద్దనోట్ల రద్దు అంటూ ప్రకటన రావడంతో.. దెయ్యం థియేటర్లలోకి రావడం లేదంటూ నవంబర్ 11న ప్రకటించేసిన నిర్మాత.. డిసెంబర్ లో రిలీజ్ చేస్తానని కూడా చెప్పాడు. కానీ ఆ సమయంలో సినిమా రిలీజ్ చేయడం చాలా కష్టమనే టాక్ వినిపిస్తోంది.

రామ్ చరణ్ ధృవతో పాటు.. కోలీవుడ్ మూవీస్ అయిన సూర్య సీక్వెల్ సింగం3..విశాల్ మూవీ ఒక్కడున్నాడు కూడా.. అదే సమయానికి రావాల్సి ఉండగా.. వాయిదాకు రెడీ అయిపోతున్న విషయం తెలిసిందే. మరి ఇంట్లో దెయ్యం నాకేం భయం రిలీజ్ డేట్ ఎప్పుడంటూ.. అల్లరి నరేష్ ని అడిగితే 'మీకెంత తెలుసో నాకు కూడా అంతే' అనేశాడు హీరో. మరి హీరోకే క్లారిటీ లేకపోతే.. ఇక ఆడియన్స్ పరిస్థితేంటో!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News