నిజానికి ''కబాలి'' జూలై 22న వస్తోందంటే.. చాలా సినిమాలు రిలీజులను పోస్టుపోన్ చేసుకుంటున్నాయి. అదే రోజు రావల్సిన జక్కన్న.. చుట్టాలబ్బాయి.. అలాగే ఈ 15నే రావల్సిన కొన్ని సినిమాలు వెనక్కి తగ్గాయి. కాని అల్లరోడు మాత్రం.. నాకు ఒక వారం చాలేహా అన్నట్లు ఈ శుక్రవారం నాడు ''సెల్ఫీ రాజా''తో రావడానికి సిద్దపడిపోయాడు. అయితే ఈ డేరింగ్ తో పాటే రాజాకు లక్ ఎలా కలిసొచ్చిందో చూడండి.
ఈ సినిమాను ఇప్పటివరకు అల్లరి నరేష్ కెరియర్ లోనే హైయెస్ట్ ధియేటర్స్ రిలజుగా ప్లాన్ చేస్తున్నాడు నిర్మాత అనిల్ సుంకర. ఏకంగా నైజాంలో 170 ధియేటర్లు ఆల్రెడీ కన్ఫామ్ అయిపోయాయట. అంతే కాదు.. ఈ కౌంట్ శుక్రవారం నాటికి ఇంకా బాగా పెరిగే ఛాన్సుంది. ఇక నైజాంలో ఒక 200 అలాగే ఆంధ్రప్రదేశ్ లో ఒక 200 ధియేటర్లలో సినిమా మినిమం రిలీజవుతోంది అనమాట. ఎలాగో కబాలి పై శుక్రవారం వస్తోంది కాబట్టి.. అప్పటివరకు ధియేటర్లను ఖాళీగా పెట్టుకొని.. ఈలోపు వాటిని సెల్ఫీ రాజాకు ఇచ్చేస్తున్నారు ఎగ్జిబిటర్లు. ఆ లెక్కన ఒక వారంలో నరేష్ భారీగా వసూలు చేసేసుకోవాలి.
ఇంత గ్రాండ్ గా సినిమా రిలీజవుతోంది కాబట్టి.. ఖచ్చితంగా కంటెంట్ పరంగా ఇంప్రెస్ చేస్తే.. చాలామంది ధియేటర్ల వారు సెల్ఫీ రాజాను తీయకుండా ఉండే ఛాన్సు కూడా ఉంది. చూద్దాం మరి నరేష్ ఈసారైనా హిట్టు కొడతాడేమో.