సాధారణంగా టైటిల్ అనౌన్స్ మెంట్ తో సినిమాపై సగం బజ్ క్రియేట్ అవుతుంది. కొందరు సినిమా పేరు క్యాజువల్ గా పెట్టేసినా చాలామంది ఆచితూచి ఆకట్టుకునేలా పెడతారు. టైటిల్స్ విషయంలో వంశీ సినిమాలు అప్పట్లో మంచి పేరు తెచ్చుకున్నాయి. పూరి జగన్నాథ్ ఇండస్ట్రీలోకి వచ్చాక కొత్త ట్రెండ్ మొదలైంది. అదీ ఇడియట్ సినిమాతో. ఈ సినిమా హిట్టవడంతో కొన్ని సినిమాలకు తిట్లనే టైటిల్స్ గా పెట్టుకుంటూ వచ్చారు. స్టుపిడ్, రాస్కెల్, ఫూల్ ఇలా కొన్ని సినిమాలొచ్చాయి. అవేవీ జనాలకు పెద్దగా నోట్ అవలేదు.
ఇప్పుడు ట్రెండ్ ఇంకోలా నడుస్తున్నట్టుంది. అనుకోని విధంగా బిచ్చగాడు హిట్ కావడంతో ఆ టైపు టైటిల్స్ మీద పడుతున్నట్టున్నారు. యాచన చేసే వారిని చిన్నచూపు చూస్తూ అనే మాట బిచ్చగాడు. అందులో డెప్త్ లేదనుకున్నారో ఏమో బిచ్చగాడు టైటిల్ పెట్టి సినిమా రిలీజ్ చేసేశారు. తాజాగా రాజ్ తరుణ్, హెబ్బా పటేల్ హీరో హీరోయిన్లుగా అంధగాడు అనే సినిమా తీస్తున్నారు. కామెడీ ఎంటర్ టైనర్ గా తీస్తున్న ఈ సినిమాలో హీరో అంధుడు కావడంతో ఈ టైటిల్ పెట్టామంటున్నారు. ఎవరైనా బిక్షాటన చేయడమనేది వారున్న పరిస్థితుల కారణంగా చేసే పని. అది వారి నిర్ణయం తప్ప వారిలోని లోపం కాదు. ఆ రకంగా బిచ్చగాడు టైటిల్ ఓకే అనుకోవచ్చు. కానీ అంధత్వమనేది లోపం. ఆ లోపమున్న వ్యక్తిపై సినిమా తీస్తూ దానికి కామెడీ టచ్ ఇస్తూ టైటిల్ పెట్టడంపై పలు అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
సినిమా టైటిల్ ఎలా ఉండాలన్న దానిపై పర్ ఫెక్ట్ జస్టిఫికేషన్ అంటూ ఏమీ ఉండదు. అది అందరినీ ఆకట్టుకునేలా ఉండాలి తప్ప ఎవరినీ నొప్పించేలా ఉండకూడదు. అంధగాడు టైటిల్ బాగుందని ఫిక్సయిపోవడం తప్ప అది కించపరిచేలా ఉందన్న విషయం విస్మరించడం కరెక్ట్ కాదు. దీనిపై ఆ సినిమా మేకర్స్ ఏమంటారో చూడాలి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/