ఈ మధ్య సెన్సార్ బోర్డుపై విమర్శలు ఓ రేంజ్ లో ఉంటున్నాయి. ఉడ్తాపంజాబ్ లాంటి సినిమాలతో కోర్టు మొట్టికాయలు.. ఎదురుదెబ్బలు కూడా తగిలాయి. అయినా సరే వీళ్ల విచిత్రమైన ప్రవర్తన ఇంకా ఛేంజ్ అయినట్లుగా కనిపించడం లేదు. ఇప్పుడు సూపర్ స్టార్ రజినీకాంత్ మూవీ కబాలికి యు సర్టిఫికేట్ ఇవ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
రక్తపాతం కనిపిస్తే చాలు U/A కానీ A కానీ తప్ప వేరే సర్టిఫికేట్ ఇవ్వడం కుదరదని భీష్మించుకు కూర్చుంటారు సెన్సార్ సభ్యులు. కానీ విచిత్రంగా కబాలికి మాత్రం యూ సర్టిఫికేట్ వచ్చేసింది. ఈ సినిమా సెకండాఫ్ లో అయితే గ్యాంగ్ స్టర్ల ముష్టి యుద్దాలను.. క్లైమాక్స్ ఫైట్ ను ఓ రేంజ్ లో చూపించారు. సూపర్ స్టార్ లాంటి సూపర్ హీరో కత్తితో మెడలో దించేస్తాడు. అక్కడ బ్లడ్ కనిపించినా కనిపించకపోయినా కూడా.. అసలు చేసే ఆ విన్యాసమే ఘోరం. అయినా సరే కబాలికి 'U' సర్టిఫికేట్ వచ్చేసింది.
ఇది రజినీకాంత్ మూవీ అని కాస్త లిబరల్ గా వ్యవహరించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పెద్ద స్టార్స్ సినిమాలయితే ఓ రకంగా.. చిన్న సినిమాలయితే మరో రకంగా సెన్సార్ బోర్డ్ వ్యవహరిస్తుందనే ఆరోపణలకు కబాలి సెన్సార్ సర్టిఫికేట్ ని మించిన సాక్ష్యం అక్కర్లేదేమో!!