'సైరా' నుంచి తప్పుకోనున్నాడా ?

Update: 2017-09-14 13:08 GMT
మెగాస్టార్ కెరీర్ లో అత్యంత భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం "సైరా". 150 చిత్రాల్లో నటించిన చిరంజీవి మొదటి సారి ఓ చారిత్రాత్మక బయోపిక్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా లాంచింగ్ కార్యక్రమాలు జరుపుకున్న ఈ ససినిమా త్వరలోనే భారీ యుద్ధ సన్నివేశాలతో షూటింగ్ జరుపుకోవడానికి సిద్దమవుతోంది. అందుకోసం చిత్ర దర్శకుడు సురేందర్ రెడ్డి అంతా సిద్ధం చేసుకున్నాడు.

ఇకపోతే ఈ హిస్టారికల్ ఫిల్మ్ కి అతి ముఖ్యమైన ప్రధాన ఆయుధం బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్. సో అందుకే చిత్ర నిర్మాత రామ్ చరణ్ ఎవ్వరిని నమ్మకుండా ఆస్కార్ గ్రహీత ఏ.ఆర్ రెహమాన్ ని ఎంపిక చేసుకున్నాడు. ఆయన ఒక్కడైతేనే సినిమాకు కరెక్ట్ అని.. అలాగే ఇతర భాషల్లో కూడా సినిమా తెరకెక్కుతుండడంతో అయన మ్యూజిక్ ఖచ్చితంగా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుందని ధీమాగా ఉన్నారట. అయితే గత కొన్ని రోజులుగా ఈ సినిమాకు సంబందించిన కొన్ని రుమార్లు వివిధ వెబ్ సైట్స్ లలో ఆందోళనను కలిగిస్తున్నాయి. ఎందుకంటే సురేందర్ రెడ్డికి రెహమాన్ ఆలోచన విధానం సరిగ్గా కనెక్ట్ అవ్వడం లేదని పలు రకాలుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఇది నిజమేనా?

అయితే అలాంటిది ఏమి లేదని తెలుస్తోంది. ప్రస్తుతం సురేందర్ రెడ్డి తో చిత్ర కథలోని ప్రతి సిన్ ని రెహమాన్ కి అర్థమయ్యేటట్లు చెబుతున్నాడు. రెహమాన్ కూడా తనకున్న అనుభవం ఆధారంగా తెలిసిన విషయాల్ని సురేందర్ రెడ్డి కి చెబుతున్నాడు. చిరంజీవి ప్రతిష్టాత్మక చిత్రం కాబట్టి రెహమాన్ కూడా సినిమాను సవాల్ గా తీసుకొని డైరెక్టర్ కి అనుగుణంగా నడుచుకుంటున్నాడట. ఇక రామ్ చరణ్ కూడా అప్పుడపుడు వీరితో కలుస్తున్నాడట. ఎంతో కష్టపడి చిత్ర యానిటీ అందరు కలిసికట్టుగా పనిచేస్తున్నారు.. సో రెహమాన్ కి దర్శకుడికి మధ్య విభేదాలు తలెత్తాయని అనడంలో నిజం లేదు అంటున్నారు సన్నిహితులు. అది సంగతి.
Tags:    

Similar News