మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ పొలిటికల్ యాక్షన్ డ్రామా 'గాడ్ ఫాదర్'. మలయాళ హిట్ ఫిల్మ్ 'లూసీఫర్' ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీ దసరా సందర్భంగా ప్రేక్షకుల ముందుకొచ్చిన విషయం తెలిసిందే. అక్టోబర్ 5న భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీకి ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. దాదాపు ఐదు రోజుల పాటు అనూహ్య వసూళ్లని రాబట్టిన ఈ మూవీ మండే నుంచి చేతులు ఎత్తేసినట్టుగా తెలుస్తోంది.
మెగాస్టార్ చిరంజీవి, నయనతారతో పాటు బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కీలక అతిథి పాత్రలో నటించిన ఈ మూవీ మండే నుంచి డీలా పడిపోయింది. సెకండ్ వీక్ ఈ మూవీ వసూళ్ల జోరు మరింతగా పెరిగే ఛాన్స్ వుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్న నేపథ్యంలో ఈ మూవీకి అనూహ్యంగా కన్నడ సినిమా 'కాంతార' స్పీడ్ బ్రేకర్ గా మారి షాకిచ్చింది. చిన్న సినిమాగా విడుదలైన ఈ మూవీ భారీ వసూళ్లని రాబడుతూ ప్రతీ ఒక్కరినీ ఎట్రాక్ట్ చేస్తోంది.
ఈ మూవీని మాస్టర్ మైండ్ అల్లు అరవింద్ గీతా ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ పై తెలుగులో విడుదల చేశారు. చిన్న సినిమాగా విడుదలైన ఈ మూవీ భారీ సినిమాలకు ధీటుగా వసూళ్లని కాబడుతూ ట్రేడ్ వర్గాలనే విస్మయానికి గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో చిరు 'గాడ్ ఫాదర్'కు అనూహ్యంగా బాక్సాఫీస్ వద్ద ఎదురు దెబ్బ తగిలింది. కారణం చాలా చోట్ల ఈ మూవీకి 'కాంతార' వత్త గట్టి ఎదురు దెబ్బతగిలింది. ఈ నేపథ్యంలో మెగా ఫ్యాన్స్ ఈ మూవీని విడుదల చేసిన అల్లు అరవింద్ పై సోషల్ మీడియా వేదికగా కామెంట్ లు చేస్తూ ఫైర్ అవుతున్నారు.
మెగాస్టార్ మూవీ థియేటర్లలో వుండగానే కావాలనే 'కాంతారా'ని అల్లు అరవింద్ విడుదల చేశాడంటూ మండి పడుతున్నారు. అయితే అల్లు అరవింద్ ఈ మూవీ ఈ రేంజ్ లో హిట్ అవుతుందనికానీ, బాక్సాఫీస్ వద్ద ఊహించని విధంగా వసూళ్లని రాబడుతుందని కానీ ఊహించలేదట. చిన్న సినిమా.. ఈ రేంజ్ విజయం అన్నది ఊహించలేదని అల్లు వర్గాలు అంటున్నాయి.
ఇదిలా వుంటే 'గాడ్ ఫాదర్' ప్రస్తుత పరిస్థితుల్లో మార్పు రాకపోతే బ్రేక్ ఈవెన్ ని కూడా సాధించడం కష్టమని, సినిమాలో లోపాలని పెట్టుకుని దాన్ని కప్పిపుస్తూ చిన్న సినిమా 'కాంతార' వల్ల చిరు సినిమా వెనకబడిందని ప్రచారం చేయడం అవమానరమని ట్రేడ్ వర్గాలు పెదవి విరుస్తున్నాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.