`కాంతార` ఎక్కడ చూసినా.. ఎక్కడ విన్నా ఇదే పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. భాషతో సంబంధం లేకుండా బాక్సాఫీస్ వద్ద ఊహకందని తీరితో రికార్డుల్ని తిరగరాస్తూ దేశ వ్యాప్తంగా ట్రేడ్ పండితుల్ని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. రిషబ్ శెట్టి హీరోగా నటించి రచయితగా స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ మూవీ కర్ణాటకలో సెప్టెంబర్ లో విడుదలైన అక్కడ సంచలన విజయాన్ని సాధించడమే కాకుండా రికార్డు స్థాయి వసూళ్లని రాబట్టింది. ఇప్పటికే రూ.100 కోట్లకు మించి కన్నడ నాట వసూళ్లని రాబట్టింది.
ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలకు అద్దంపట్టే భూతకోల నృత్యకారులని తెరపై చూపించిన తీరు, భూతకోల వేషధారణలో రిషబ్ షెట్టి ప్రదర్శించిన నటన, పలికించిన హావభావాలు, మరీ ముఖ్యంగా క్లైమాక్స్ లోని చివరి 15 నిమిషాల్లో తనదైన నటనతో రిషబ్ శెట్టి అబ్బుర పరిచిన తీరుకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. భాషతో సంబంధం లేకుండా భావోద్వేగాలకు కనెక్ట్ అవుతూ ఊహించని విధంగా ఈ మూవీపై కాసుల వర్షం కురిపిస్తున్నారు.
సెప్టెంబర్ లో కన్నడలో విడుదలై సంచలనం సృష్టిస్తున్న ఈ మూవీని తెలుగులో గత శనివారం గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఓన్లీ డిస్ట్రబ్యూషన్ మాత్రమే గీతా చూసుకుంది. మిగతా మొత్తం హోంబలే ఫిలింస్ వారే చూసుకోవడంతో అ్లు అరవింద్ కు ఈ మూవీ వల్ల భారీ లాభాలు వచ్చే అవకాశం మిస్సయింది. ఇక ఇదిలా వుంటే తెలుగులోనూ ఈ మూవీ రికార్డు స్థాయి వసూళ్లని రాబడుతున్న వేళ ప్రత్యేకంగా సక్సెస్ మీట్ ని ఇటీవల హైదరాబాద్ లో నిర్వహించారు.
ఈ సందర్భంగా తమ గీతా ఆర్ట్స్ బ్యానర్ లో ఓ మూవీ చేయమని అల్లు అరవింద్ హీరో రిషబ్ శెట్టిని రిక్వెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఇది రిషబ్ శెట్టి హీరోగా మాత్రం కాదనే వార్తలు వినిపిస్తున్నాయి. కేవలం రైటర్ గా మాత్రమే రిషబ్ గీతా ఆర్ట్స్ లో సినిమా చేయబోతున్నాడని చెబుతున్నారు. రిషబ్ శెట్టి రీసెంట్ గా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు సరిపోయే టెర్రిఫిక్ స్టోరీని వినిపించాడని వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే చరణ్ కు స్టోరీని వినిపించబోతున్నారని, చరణ్ ఫైనల్ గా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తే మిగతా పనులు చక చక మొదలవుతాయని తెలుస్తోంది.
ఈ మూవీకి రిషబ్ శెట్టి అసోసియేట్ డైరెక్ట్ చేసే అవకాశం వుందని చెబుతున్నారు. చరణ్ గీతా ఆర్ట్స్ లో `ధృవ` తరువాత సినిమా చేసి చాలా కాలమవుతోంది. మళ్లీ ఇన్నాళ్లకు ఈ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చే అవకాశం వుందని తెలుస్తోంది. `RRR` ప్రమోషన్స్ కోసం జపాన్ లోని టోక్యోలో వున్న చరణ్ త్వరలో ఇండియా తిరిగి రాగానే రిషబ్ శెట్టి చేత అల్లు అరవింద్ కథ చెప్పిస్తారట.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.