గంధపు చెక్కల స్మగ్లర్ పుష్పరాజ్ కథను వెండితెరపై చూసి ఆనందించాం. పుష్పరాజ్ గట్స్ ని మెచ్చని వాళ్లు లేరు. ఇందులో పుష్పరాజ్ ని ఢీకొనే టిఫికల్ ఫారెస్ట్ ఆఫీసర్ గా ఫహద్ ఫాజిల్ నటనకు జేజేలు పలికారు. ఇప్పుడు ఇంచుమించు అలాంటి పాత్రలు అలాంటి కథతోనే మరో సినిమా తెరకెక్కింది. ఇక్కడ కూడా చెట్లు మాయమవుతుంటాయి. వాటిని తరలించేది చిత్రకథానాయకుడు శ్రీను (రిషబ్ శెట్టి). అతడిని వేటాడే ఫారెస్ట్ ఆఫీసర్ ని కూడా ట్రైలర్ లో పవర్ ఫుల్ గా ఆవిష్కరించారు. అయితే పుష్పతో పోలిస్తే ఇక్కడ డిఫరెన్స్ అంతా కల్చరే. పుష్ప చిత్రాన్ని తిరుమల- చిత్తూరు అడవులలో గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంగా చూపించగా... ఇక్కడ కేరళ అడవుల్లో స్మగ్లర్ కథను తెరపై ఆవిష్కరించారు.
కేరళలోని అందమైన సంస్కృతిని ఈ చిత్రంలో ఎంతో గొప్పగా ఆవిష్కరించారని అక్కడ పల్లె పట్టు అందాలను అడవులను ఎంతో మెస్మరైజింగ్ గా ఆవిష్కరించారని తాజాగా రిలీజైన `కాంతార` తెలుగు ట్రైలర్ వీక్షించాక అర్థమవుతోంది. ఇందులో కథానాయికతో హీరో ఘాటైన రొమాన్స్ లవ్ ఆకట్టుకున్నాయి. ఇక రిషబ్ శెట్టి నటన కూడా అంతే ఎనర్జిటిక్ గా ఆకట్టుకుంటోంది. ట్రైలర్ ఆద్యంతం దొంగా పోలీస్ టింజ్ ఆకట్టుకుంది.
కేజీఎఫ్ లాంటి భారీ ఫ్రాంఛైజీతో సంచలనాలు సృష్టించిన హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ ఈ సినిమా కోసం భారీ పెట్టుబడులు వెదజల్లిందని విజువల్స్ చెబుతున్నాయి. కెజిఎఫ్2 కి ముందు పునీత్ చివరి సినిమాగా విడుదలైన `యువరత్న` ను నిర్మించింది కూడా హోంబలే ఫిల్మ్ సంస్థే. ఈ ఏడాది వచ్చిన కెజిఎఫ్2` ప్రపంచ వ్యాప్తంగా సంచలన విజయం సాధించి వెయ్యి కోట్లు వసూలు చేసింది. ఈ సంస్థ తీస్తున్న సినిమాలలో ఎక్కువగా పాన్ ఇండియా రేంజ్ సినిమాలే. అదే కేటగిరీలో కాంతారను విడుదల చేయనున్నారు.
తాజాగా హోంబలే ఫిల్మ్స్- రిషబ్ షెట్టి కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం కాంతారా ఆసక్తిని పెంచుతోంది. ఈ సినిమాకు సంబంధించిన టీజర్- ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. కన్నడలో సెప్టెంబర్ 30వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం విడుదలైన ప్రతీ చోట భారీ రెస్పాన్స్ ను అందుకుంది.
ప్రస్తుతం ఈ సినిమాను ఇతర భాషల్లో కూడా డబ్ చేసి విడుదల చేయనున్నారు. ఈ సినిమా తెలుగు థియేట్రికల్ రైట్స్ ని అగ్ర నిర్మాత అల్లు అరవింద్ సొంతం చేసుకుని `గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్` ద్వారా రిలీజ్ చేయనున్నారు. కాంతారా అంటే సంస్కృత భాషలో అడవి. ప్రేమ చూపిస్తే అంతకు మించిన ప్రేమను.. విధ్వంసం సృష్టిస్తే.. అంతకంటే ఎక్కువ విధ్వంసాన్ని రిటర్న్ గిఫ్టుగా ఇవ్వడం అడవి తల్లి నైజం. ప్రేమ భావోద్వేగాలు గ్రామీణ వాతావారాన్ని ఆహ్లదకరంగా చూపించిన ఈ చిత్ర తెలుగు ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంది. అక్టోబర్ 15న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
రిషబ్ శెట్టి నటించడమే కాకుండా స్వయంగా దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంలో అచ్యుత్ కుమార్- ప్రమోద్ శెట్టి కీలక పాత్రల్లో కనిపించారు.అజనీష్ లోక్ నాథ్ ఈ చిత్రానికి సౌండ్ ట్రాక్ లను అందించారు. హోంబలే ఫిలింస్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ నిర్మించారు. అరవింద్ ఎస్ కశ్యప్ సినిమాటోగ్రఫీ ప్రధాన ఆస్సెట్ అని చెప్పాలి.
Full View