అతి తక్కువ కాలంలో తెలుగు చిత్ర పరిశ్రమలో టాలెంటెడ్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న కిరణ్ అబ్బవరం మరో భిన్నమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఎలాంటి హడావిడి లేకుండా డీసెంట్ ప్రమోషన్స్ తో సమ్మతమే అనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.
ఈ సినిమాపై అన్ని వర్గాల ప్రేక్షకులకు పెద్దగా అంచనాలు లేకపోయినప్పటికీ కూడా ఈ హీరో మీద నమ్మకంతో ఓ మోస్తారు ప్రేక్షకులు మొదటిరోజు థియేటర్స్ కు వచ్చే అవకాశం అయితే ఉంది.
ఎందుకంటే ఇంతకుముందు ఈ హీరో నుంచి వచ్చిన రాజావారు రాణి గారు అలాగే ఎస్ఆర్ కళ్యాణమండపం అనే సినిమాలు బాగానే క్లిక్ అయ్యాయి. ఆ తర్వాత శెబాస్టియన్ Pc 524 అనే సినిమా వచ్చింది. కానీ ఆ సినిమా ఏమాత్రం వర్కౌట్ కాలేదు. ఇక ఇప్పుడు సమ్మతమే అనే సినిమాతో సక్సెస్ అందుకోవాలి అని చూస్తున్నాడు.
జూన్ 24న ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు. అయితే ఈ సినిమాకు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ మద్దతు ఇస్తూ ఉండడం విశేషం. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా డిస్ట్రిబ్యూషన్ ద్వారా సినిమాకు అవసరమైనంత స్క్రీన్స్ లలో విడుదల చేయబోతున్నారు. ఇక మొదటి రోజు టాక్ బాగుంటే ఆ తర్వాత థియేటర్ల సంఖ్య ను మరింత పెంచే అవకాశం ఉందట.
ఏదేమైనా కూడా ఇండస్ట్రీలో కొంతమంది పెద్దలు చిన్న వారిని పైకి రాకుండా చేస్తున్నారు అనే విమర్శలకు అల్లు అరవింద్ ఒక విధంగా కౌంటర్ ఇస్తున్నారు అని చెప్పవచ్చు. గీతా ఆర్ట్స్ లో కేవలం అగ్రహీరోలు మాత్రమే కాకుండా విజయ్ దేవరకొండ కార్తికేయ నిఖిల్ అలాగే మరికొంత మంది చిన్న హీరోలకు కూడా అవకాశాలు దక్కుతున్నాయి.
ఇక ఇప్పుడు మరో చిన్న హీరో కిరణ్ అబ్బవరం సమ్మతమే సినిమాకు కూడా ఆ సంస్థ నుంచి మద్దతు అందుతూ ఉండడం మెచ్చుకోదగిన విషయం. ఇక ఈ సినిమా సంబంధించిన పాటలు కూడా విడుదల చేయలేదు. కంపోజ్ చేసిన మూడు పాటలు కూడా సినిమాలోనే ఉంటాయని ప్రమోట్ చేస్తున్నారు. మరి సమ్మతమే బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సక్సెస్ ని అందుకుంటుందో చూడాలి