వెండితెర మీద రామాయణం వంటి మహా కావ్యాలను చూపించాలంటే ఒక ఛాలెంజ్. అలాగే మహాభారతం కూడా అంతే. ఇప్పటివరకు ఇలాంటి కావ్యాలను టివి సీరియల్స్ రూపంలో చూశామే తప్పించి.. వెండితెరపై అద్భుతమైన గ్రాఫిక్స్ పరిజ్ఞానంతో ఒక హాలీవుడ్ సినిమా తరహాలో చూడలేదు. అందుకే ఇప్పుడు అల్లు అరవింద్ రామాయణ మహా కావ్యాన్ని తెరకెక్కించడానికి కంకణం కట్టుకున్నారట.
మొన్ననే రాజమౌళి బాహుబలి రిలీజ్ అయ్యాక మహాభారతం అన్నాడు కాబట్టి.. తన సొంత ప్రొడక్షన్లో మగధీరను తీసిన అరవింద్ ఇప్పుడు అతనితో కలసి సినిమా తీస్తున్నాడేమో అనుకునేరు. కాదండోయ్. కేవలం 500 కోట్లు ఖర్చు పెట్టాలని మాత్రమే ప్రస్తుతానికి ఫిక్సయ్యారు. ఓ రెండు భాగాలుగా 'సంపూర్ణ రామాయణాన్ని' సినిమాగా తీయాలని అల్లు అరవింద్.. మధు మంతెన.. నమిత్ మల్హోత్రా నిర్ణయించుకున్నారట. స్వయంగా అరవిందే ఈ విషయాన్ని ఒక ముంబయ్ మీడియావారికి ప్రకటించారు. అయితే ఇది మేజర్ గా హిందీ సినిమా అని.. లోకల్ బాషల్లోకి డబ్ చేస్తారని కొందరు అంటుంటే.. తన కొడుకు అల్లు అర్జున్ తో వీరాంజనేయుడి వేషం వేయించే ఛాన్సుందని ఇంకో టాక్ కూడా వినిపిస్తోంది. రాముడి పాత్ర కోసం ఒక ప్రముఖ బాలీవుడ్ హీరోను ఎప్రోచ్ అయ్యారట.
అయితే ఈ సినిమా విషయంలో జనాలకు వచ్చే మేజర్ సందేహం ఏంటంటే.. అసలు 500 కోట్లతో అందరికీ తెలిసిన కథను సినిమాగా తీస్తున్నారంటే.. అందులో కొత్తగా ఏం చూపిస్తారు అనేదే ఆశ్చర్యకరమైన విషయం. రామాయణ మనందరికే కాదు.. ప్రపంచానికి కూడా తెలిసిన కథ.. కాబట్టి ఈ కథలో కథనం అండ్ విజువల్స్ చాలా ముఖ్యం. అసలు డైరక్టర్ ఎవరు.. హీరో ఎవరు.. క్యాస్టింగ్ ఎవరెవరు.. అనే విషయాలు తెలిస్తేనే ఈ ప్రాజెక్టుపై ఒక క్లారిటీ వచ్చేది. అల్లూ సారూ.. అవి కూడా చెప్పండి ప్లీజ్!!