డీజే లాంటి బ్లాక్ బస్టర్ మూవీని బన్నీకి ఇచ్చాడు హరీష్ శంకర్. ఈ జోడీ కలిసి మరో సినిమా చేయాల్సి ఉన్నా రకరకాల కారణాలతో కుదరలేదు. కానీ హరీష్ శంకర్- అల్లు అర్జున్ ఒక వాణిజ్య ప్రకటన షూటింగ్ కోసం చేతులు కలిపారు.
హరీష్ శంకర్ ఒక ప్రైవేట్ జెట్ లో షూటింగ్ కోసం వెళుతూ అల్లు అర్జున్ తో కలిసి ఉన్న ఫోటోలను పోస్ట్ చేశాడు. ``ఇది ఎల్లప్పుడూ అవర్ వోన్ ICON STAAR అల్లు అర్జున్ తో సరదాగా ప్రయాణించేదే ..ఒక యాడ్ షూట్ కోసం చేతులు కలిపాం..ఎగ్జయిటెడ్ !!! #యాడ్ షూట్స్ అంటూ హరీష్ శంకర్ తన అధికారిక సోషల్ మీడియా పేజీలో పోస్ట్ చేశారు.
అల్లు అర్జున్ త్వరలో సుకుమార్ దర్శకత్వంలో `పుష్ప: ది రూల్` చిత్రీకరణను ప్రారంభించనున్నారు. హరీష్ శంకర్ తదుపరి పవన్ కల్యాణ్ తో సినిమా చేయాల్సి ఉంది.
భవదీయుడు భగత్ సింగ్ కన్నాళ్లుగా ఆలస్యమవుతోంది. అలాగే ఎనర్జిటిక్ హీరో రామ్ తో హరీష్ సినిమా చేయాల్సి ఉంది.
బన్నీతో మళ్లీ ఎప్పుడు? అన్నదానికి హరీష్ స్వయంగా సమాధానం చెప్పాల్సి ఉంది. డీజే- దువ్వాడ జగన్నాథమ్ లా మాంచి బ్లాక్ బస్టర్ కోసం మళ్లీ జంటగా బరిలో దిగుతారేమో.
సుకుమార్ తర్వాత బన్ని ప్రశాంత్ నీల్ దర్శకత్వంలోనూ నటించే అవకాశం ఉంది. రాజమౌళి కోసం కూడా అతడి ప్రయత్నాలు సాగుతూనే ఉన్నాయి.