ఫోటో స్టోరి: బన్నీ-స్నేహ అదిరే సెల్ఫీ

Update: 2017-04-03 04:44 GMT
స్టైలిష్‌ స్టార్‌గా అభిమానుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్న అల్లు అర్జున్‌.. ఇటు సినిమాల్లో బిజీగా ఉంటూనే.. అటు పర్సనల్ లైఫ్‌ ను కూడా బాగా చూసుకుంటాడు. అందుకే ఇప్పుడు డిజె దువ్వాడ జగ్నాథమ్ సినిమాకు షార్ట్ బ్రేక్ ఇచ్చేసి.. మనోడు చక్కగా గోవాలో తన సతీమణితో కలసి టైమ్ స్పెండ్ చేస్తున్నాడు.

అల్లు అర్జున్ మరియు వైఫ్‌ స్నేహారెడ్డి ప్రస్తుతం గోవాలోని 'W' హోటల్లో సేద తీరుతున్నారు. అక్కడే ఉంటి తమ పిల్లలు అయాన్.. అర్హాలతో కూడా ఎంజాయ్ చేస్తున్నారట. ఇప్పటికే చుక్కలు చూపిస్తున్న సమ్మర్ ను బీట్ చేయడానికి గోవాయే బెటర్ అనుకున్నారేమో. ఇక ఇద్దరూ కలసి అక్కడ ఎంజాయ్ చేస్తున్న టైములో ఒక సెల్ఫీ తీసుకుని.. దానిని అభిమానులతో షేర్ చేసుకున్నారు. మనోళ్లు ఇలా షేర్ చేశారో లేదు.. ఫ్యాన్స్ అలా ఎక్సయిట్ అయిపోయారు.

పైగా ఈ మధ్యనే బన్నీ ఫేస్ కు ఏదో అయ్యింది అందుకే మాస్క్ పెట్టుకుని తిరుగుతున్నాడు అంటూ రూమర్లు కూడా రావడంతో.. అ అదిరిపోయే సెల్ఫీ అన్నింటికీ ఒక్కసారే సమాధానం చెప్పినట్లయ్యింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News