బన్నీ త్రివిక్రమ్ కాంబో హాట్ అప్ డేట్

Update: 2019-03-15 11:59 GMT
చాలా టైం తీసుకుంటున్నప్పటికీ త్రివిక్రమ్ శ్రీనివాస్ పక్కా స్క్రిప్ట్ తో సెట్ లోకి అడుగుపెట్టబోతున్నట్టు తెలిసింది. అభిమానులకు అసహనం కలిగినా తొందరపాటు వద్దని ఇద్దరికీ పూర్తి నమ్మకం కుదిరాకే మొదలుపెడదామని స్టైలిష్ స్టార్ మొదట్లోనే చెప్పడం వల్ల ఇంత లేట్ అవుతోందని ఇన్ సైడ్ టాక్. ఇకపోతే సన్ అఫ్ సత్యమూర్తి తరహాలో ఇందులో కూడా బలమైన ఫాదర్ సెంటిమెంట్ ఉంటుందట.

అయితే అందులో నాన్న ప్రకాష్ రాజ్ పాత్ర కేవలం సినిమా ప్రారంభంలో కొన్ని నిముషాలు మాత్రమే ఉంటుంది. తర్వాత చనిపోతుంది. కానీ ఇప్పుడు చేయబోతున్న సినిమాలో అలా కాకుండా చివరిదాకా ఉండేలా ప్లానింగ్ చేశారట. చాలా కాలం తర్వాత త్రివిక్రమ్ మార్క్ ఫామిలీ సెంటిమెంట్ ఇందులో చూడబోతున్నట్టు వినికిడి

ఇదిలా ఉండగా దీనికి టైటిల్ కూడా ఫిక్స్ అయినట్టు మెగా కాంపౌండ్ లీక్ ఒకటి చక్కర్లు కొడుతోంది. 'నాన్న నేను' అనే పేరుని త్రివిక్రమ్ బలంగా రికమండ్ చేస్తున్నాడట. ఇంత ప్రాధాన్యత ఉన్న పాత్ర కాబట్టి సీనియర్ ఆర్టిస్ట్ కోసం త్రివిక్రమ్ అన్వేషిస్తున్నాడని కన్నడ స్టార్ హీరో ఒకరిని ఫిక్స్ చేసేందుకు ట్రై చేస్తున్నట్టుగా తెలిసింది. ఇవన్నీ కొలిక్కి వచ్చే లోపు బన్నీ బర్త్ డే వచ్చేలా ఉంది. అదే బెస్ట్ ముహూర్తం అనుకుని షురూ చేస్తారేమో చూడాలి.

నాన్న నేను టైటిల్ ఫాన్స్ కి నచ్చేలా ఉండటంతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకునేలా ఉంది. మాస్ కి వెంటనే కనెక్ట్ కాలేకపోయినా సబ్జెక్టు పరంగా వాళ్లకు కావాల్సిన మాసాలాలకు లోటు లేకుండా ప్లాన్ చేశారట. పూజా హెగ్డే మెయిన్ హీరోయిన్ గా క్యాథరిన్ త్రెసా సెకండ్ లీడ్ కోసం చర్చలు జరుగుతున్నాయని న్యూస్. మరికొద్ది రోజుల్లో క్లారిటీ వస్తుంది
Tags:    

Similar News