బ‌న్ని- స్నేహ జోడీ చిక్కారిలా

Update: 2019-07-09 10:09 GMT
ఖ‌రీదైన ఫాల్కన్ వ్యానిటీ వ్యాన్ ని సొంతం చేసుకున్నాడు బ‌న్ని. ఈ సంద‌ర్భంగా రివీల్ చేసిన ఫాల్క‌న్ ఫోటోలు వెబ్ లో సునామీ స్పీడ్ తో దూసుకుపోయాయి. బ‌న్ని ఈ ఖ‌రీదైన వ్యాన్ కోసం ఏకంగా 7కోట్లు ఖ‌ర్చు చేయ‌డంపైనా ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగింది. ఈ వ్యానిటీ వ్యాన్ ని ముంబై కి చెందిన ఆటోమొబైట్ డిజైనింగ్ స్పెష‌లిస్ట్ రూపొందించార‌ని ప్ర‌చార‌మైంది.  ఆ ఎపిసోడ్ గురించి ముచ్చ‌టించుకుంటున్న స‌మ‌యంలోనే అల్లు అర్జున్ - స్నేహారెడ్డి జోడీ ముంబైలో ఓ పార్టీని ఏర్పాటు చేయ‌డం ఆస‌క్తిని రేకెత్తించింది.

ఈ పార్టీకి మిల్కీ వైట్ బ్యూటీ త‌మ‌న్నా.. దేశ‌ముదురు బ్యూటీ హ‌న్సిక ముఖ్య అతిధులుగా విచ్చేశారు. బ‌న్ని- స్నేహ జంట‌తో క‌లిసి బ్రంచ్ లో పాల్గొన్నారు. అయితే అది ఫాల్క‌న్ కొన్నందుకు పార్టీనా.. లేక ఇంకేదైనానా? అన్న‌ది బ‌న్ని ఇంకా చెప్ప‌నేలేదు. ఓవైపు ముంబైని వ‌ర్షాలు కూల్ గా చీర్స్ చేస్తుంటే.. ఆ రెయినీ సీజ‌న్ ని బాగా ఎంజాయ్ చేసిన బ‌న్ని తిరిగి హైద‌రాబాద్ కి విచ్చేశారు. తాజాగా శంషాబాద్ విమ‌నాశ్ర‌యంలో బ‌న్ని - స్నేహ జంట కెమెరా కంటికి చిక్కారు. బ‌న్ని య‌థావిధిగా స్పోర్ట్స్ డ్రెస్ లో క‌నిపించారు. స్నేహారెడ్డి క్రీమ్ క‌లర్ టాప్ - డెనిమ్స్ లో స్టైలిష్ గా గాగుల్స్ పెట్టుకుని విమానాశ్ర‌యం నుంచి బ‌య‌ట‌కు వ‌స్తున్నారు.

ముంబై పార్టీలు ఎలానూ అయిపోయాయి కాబ‌ట్టి ఇక బ‌న్ని త‌దుప‌రి షెడ్యూల్స్ కి రెడీ అవుతున్నార‌నే అర్థం. త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో ఏఏ19 తొలి షెడ్యూల్ పూర్త‌యింది. త‌దుప‌రి కీల‌క షెడ్యూల్ కోసం టీమ్ ప్రిప‌రేష‌న్ లో ఉంది. అలాగే వేణు శ్రీ‌రామ్ ద‌ర్శ‌క‌త్వంలో ఐక‌న్ ప్రోగ్రెస్ ఆస‌క్తిని పెంచుతోంది. త‌దుప‌రి సుకుమార్ తో ఏఏ21 సెట్స్ పైకి వెళుతుంది.
    

Tags:    

Similar News