చెర్రీ కోసం బ‌న్నీ వ‌చ్చాడండోయ్‌..

Update: 2016-03-26 03:58 GMT
రామ్ చ‌ర‌ణ్ కు.. అల్లు అర్జున్ కు ప‌డ‌ట్లేద‌ట‌..  మెగా ఫ్యామిలీతో బ‌న్నీకి క‌టీఫ్ అయిపోయింద‌ట‌.. అత‌ను వేరు కుంప‌టి పెట్టేశాడ‌ట‌.. మెగా అభిమానులందు బ‌న్నీ అభిమానులు వేర‌ట‌.. ఇలా కొన్ని రోజులుగా ర‌క‌ర‌కాల ఊహాగానాలు వినిపిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ రూమ‌ర్ల మీద ఎవ్వ‌రూ ఏం మాట్లాడ‌క‌పోయేస‌రికి.. నిజంగానే ఏదో జ‌రిగిపోతోంద‌న్న భ్ర‌మ‌ల్లో ఉన్నారు జ‌నాలు. ఐతే ఈ ఊహాగానాల‌కు తెర‌ప‌డే ప‌రిణామం జ‌రిగింది శుక్ర‌వారం. ఈ ఆదివారం రామ్ చ‌ర‌ణ్ పుట్టిన రోజు కోసం భారీ ఎత్తున ఏర్పాట్లు జ‌రుగుతున్న నేప‌థ్మంలో ఆ ఏర్పాట్ల‌లో త‌నూ భాగం పంచుకున్నాడు బ‌న్నీ.

రాంచరణ్ బర్త్ డే వేడుకలు పెద్ద ఎత్తున చేయ‌డానికి గ్రేటర్ హైదరాబాద్ మెగా అభిమానుల సంఘం అధ్య‌క్షుడు నూర్ మహ్మద్ స‌న్న‌ద్ధ‌మ‌వుతున్న నేప‌థ్యంలో.. అల్లు అర్జున్ నేరుగా ముషీరా బాద్ లోని అత‌డి ఇంటికి వెళ్ల‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. చరణ్ బర్త్ డే వేడుకల్ని గ్రాండ్ గా ప్లాన్ చేసినందుకు నూర్ ను అభినందిస్తూ... తన వంతుగా ఆర్థిక సాయం కూడా అందించాడు బ‌న్నీ.

ఈ సంద‌ర్భంగా బ‌న్నీ మాట్లాడుతూ... ‘‘చరణ్ కు మెగాభిమానులంతా ఎల్లప్పుడూ అండగా ఉంటారు. ఆయనకు మా ప్రేమాభిమానాలు ఎప్పటికీ ఉంటాయి. అభిమానులు హైదరాబాద్ లో చేయబోయే రాంచరణ్ బర్త్ డే వేడుకల్లో నేను ప్రత్యక్షంగా పాల్గొనలేకపోతున్నా. ఎందుకంటే మా ఇంట్లో శ్రీజ వివాహ వేడుక ఉంది. అభిమానులంతా కలిసి రాంచరణ్ జన్మదిన వేడుకల్ని ఇంత గ్రాండ్ గా చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. అందుకే నూర్ మహ్మద్ ను అభినందించ‌డానికి ఆయ‌న ఇంటికి వ‌చ్చా’’ అన్నాడు బ‌న్నీ. ఈ సంద‌ర్భంగా బ‌న్నీ.. నూర్ అహ్మ‌ద్ తో క‌లిసి చ‌ర‌ణ్ బ‌ర్త్ డే  కేక్ కూడా క‌ట్ చేయ‌డం విశేషం.
Tags:    

Similar News