సాంకేతికంగా టాలీవుడ్ వెనుకబడింది!
ఇక మూడవ ఎడిషన్ అంత్జాతీయ సంస్థల సమక్షంలో మరింత వైభవంగా జరుగుతుందని పి. జివిందా తెలిపారు.
ప్రపంచ వ్యాప్తంగా సినిమా రంగంలో వస్తోన్న మార్పులు- కొత్త సాంకేతిక గురించి తెలుసుకోవడం హైదరాబాద్ లో తెలంగాణ ప్రభుత్వం సహకారంతో సినిమాటోగ్రాఫర్ పి.జి విందా సినిమాటికా ఎక్స్ పో నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఓ ఎడిషన్ ఎక్స్ పో ముగిసింది. ఇటీవలే రెండవ ఎడిషన్ కూడా పూర్తయింది. ఇక మూడవ ఎడిషన్ అంత్జాతీయ సంస్థల సమక్షంలో మరింత వైభవంగా జరుగుతుందని పి. జివిందా తెలిపారు. ఈ సందర్భంగా టాలీవుడ్ ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు.
`తెలుగు పరిశ్రమ ఎంతో అభివృద్ది చెందుతుంది. ప్రతిభావంతులు ఎంతో మంది ఉన్నారు. షూటింగ్ కి ఎంతో అనుకూలమైన వాతావరణం మనకి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల సాంకేతికంగా వెనుకడుతున్నాం. ఆధునిక టెక్నాలజీ అన్నద మనకు ఆలస్యంగా పరిచయం అవుతోంది. సాంకేతికతను అందిపుచ్చుకుంటే మరింత మెరుగైన సినిమాలు చేయగలం. ఓ సినిమాటోగ్రాఫర్ గా, దర్శకుడిగా కొత్త విషయాలు తెలుసుకోవడానికి నిరంతరం ప్రయత్నిస్తుంటాం.
అందుకోసం దేశ, విదేశాల్లోని ఎన్నో ప్రాంతాలకు తిరిగాను. విదేశాల్లో కొత్త టెక్నాలజీ వచ్చిందంటే వెంటనే ఎగ్జిబిషన్లు, ఎక్స్ పోలు ఏర్పాటు చేసి దాని గురించి అందరికీ తెలిసేలా చేస్తారు. కానీ మనదేశంలో ఆస్థాయిలో వస్తు ప్రదర్శనలు జరగడం లేదు. అన్ని సంస్థలు, ప్రతిభావంతులు, ఔత్సాహిలకు అంతా ఓ చోట చేరి సాంకేతిక గురించి చర్చించుకునేలా , కొత్త సంగతులు తెలుసుకునేలా చేయాలనే మేం సినిమాటికా ఎక్స్ పోని నిర్వహిస్తున్నాం.
తొలి సీజన్ గ్రాండ్ సక్సెస్ అయింది. రెండవ సీజన్ కి 38 వేల మంది హాజరయ్యారు. ఇది ఆసియాలోనే ఓ రికార్డు. మూడవ సీజన్ ఇంకా గొప్పగా నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నాం. ఇలాంటివి నిర్వహించడం వల్ల ఎక్కువ మందికి టెక్నాలజీ రీచ్ అవుతుంది. ట్యాలెంట్ ఉన్న వారు ఎంతో మంది ఉన్నారు. కానీ టెక్నాలజీ పరంగా కొత్త విషయాలు తెలుసుకునే సోర్స్ లేకపోవడంతో వెనుకబడుతున్నారు`అని అన్నారు.