మెగా ఫ్యామిలీలోని ఏ సినిమా ఫంక్షన్ కు అయినా మెగాస్టార్ చిరంజీవిని పిలవడం ఆనవాయితీ. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా.. అన్ని సినిమాల వేడుకలకు హాజరవుతారు చిరు. తన వంతుగా సినిమా గురించి కాసిన్ని మంచి మాటలు చెప్పి ప్రచారం చేస్తారు. అల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ దువ్వాడ జగన్నాధం విషయంలో కూడా ఇదే ఆశించారు మెగా ఫ్యాన్స్. కానీ ఆశ్చర్యకరంగా డీజే ఆడియో ఫంక్షన్ కు చిరంజీవి హాజరు కాలేదు. మెగాస్టార్ లేకుండా మెగా ఫ్యామిలీ హీరో ఫంక్షన్ జరిగిపోయింది. ఇది చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే.. ప్రస్తుతం డీజే ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న బన్నీ.. ఈ వేడుకకు చిరంజీవి హాజరు కాకపోవడంపై అసలు కారణం చెప్పేశాడు. అసలు ఆయన్ను ఈ వేడుకకు ఆహ్వానించనే లేదని చెప్పాడు అల్లు అర్జున్.
'దాసరి నారాయణరావు మరణంతో ఇండస్ట్రీలో సీరియస్ వాతావరణం నెలకొంది. ఇలాంటి సమయంలో వేడుకలు జరుపుకోవడం అంత సమంజసం కాదు. అందుకే డీజే ఆడియో ఫంక్షన్ కు ఏ సెలబ్రిటీలను ఆహ్వానించలేదు. చివరకు చిరంజీవి గారిని కూడా పిలవలేదు. డీజే ఆడియో వేడుకలో ఆ సినిమాకి పని చేసిన వారు తప్ప వేరెవరకూ కనిపించలేదు' అంటూ అసలు విషయం చెప్పాడు బన్నీ. కాకపోతే ఇన్ సైడ్ టాక్ ఏంటంటే.. సరిగ్గా అదే రోజున దాసరి వారి కోసం ఫిలిం ఇండస్ర్టీ ఒక కండోలెన్స్ మీటింగ్ ఏర్పాటు చేసింది. ఉదయం ఆ సభను పూర్తి చేసుకుని సాయంత్రం ఇలా డిజె గురించి ప్రశంసలు కురిపించాలంటే చిరంజీవి చాలా ఇబ్బందిగా ఫీలయ్యారట. అందుకే ఆయనే ఎవ్వరినీ పిలవకండి.. అది బాగోదు అనే సలహా ఇచ్చారట. ఇకపోతే ఈ ఈవెంట్ జరిగిన వారం తరువాత ఇప్పుడు చిరంజీవి సినిమా ఈవెంట్లలో ఉత్సాహంగానే పాల్గొంటున్నారు. బహుశా బన్నీ కాస్త లేటుగా తన ఈవెంటును ప్లాన్ చేసుకుంటే.. చిరంజీవి వచ్చుండేవారేమో.
అయితే అల్లు అర్జున్ సినిమాలను తన కొడుకు రామ్ చరణ్ సినిమాలను చూసినట్లే.. కాస్త ముందుగానే చూడటం చిరంజీవికి అలవాడు. ఈసారి మాత్రం ఆయన ఇంకా చూడకుండానే డిజె దువ్వాడ జగన్నాథమ్ సినిమా రిలీజ్ కు రెడీ అయిపోతోంది. అది సంగతి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/