గడచిన కొన్ని సంవత్సరాలుగా సెలబ్రెటీలు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. ప్రతి ఒక్కరు కూడా తమ సినిమాలకు సంబంధించిన విషయాలను లేదంటే వ్యక్తిగత విషయాలను - అభిప్రాయాలను వ్యక్తం చేసేందుకు సోషల్ మీడియాను ఉపయోగించుకుంటున్నారు. ట్విట్టర్ - ఫేస్ బుక్ తో పాటు ఇప్పుడు ఇన్ స్టా కూడా వచ్చింది. ఇక హీరోల అభిమానులు తమ హీరోకు ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్నారంటే తమ హీరోకు ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్నారంటూ గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. ఈమద్య కాలంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్న అల్లు అర్జున్ మూడు మిలియన్ ల ఫాలోవర్స్ ను చేరుకున్నాడు.
ఫేస్ బుక్ లో అందరికంటే పై స్థానంలో ఉన్న అల్లు అర్జున్ ట్విట్టర్ లో మాత్రం ఆరవ స్థానంలో కొనసాగుతున్నాడు. మొన్నటి వరకు ఎన్టీఆర్ ఆరవ స్థానంలో ఉండగా - అల్లు అర్జున్ ఏడవ స్థానంలో ఉన్నాడు. కాని ఇప్పుడు అల్లు అర్జున్ ఒక స్థానం ఎగబాకి ఎన్టీఆర్ ను ఏడవ స్థానంకు చేర్చి - తాను ఆరవ స్థానంలో చేరాడు. అల్లు అర్జున్ కొన్ని రోజుల క్రితం మూడు మిలియన్ ల ఫాలోవర్స్ ను చేరుకున్నాడు.
ట్విట్టర్ లో అత్యధిక ఫాలోవర్స్ ఉన్న టాలీవుడ్ స్టార్ మహేష్ బాబు. ఈయనకు 7.5 మిలియన్ ల ఫాలోవర్స్ ఉన్నారు. రెండవ స్థానంలో 5.7 మిలియన్ ల ఫాలోవర్స్ తో నాగార్జున - మూడవ స్థానంలో 5.5 మిలియన్లతో రానా - నాల్గవ స్థానంలో 3.5 మిలియన్లతో పవన్ కళ్యాణ్ - కొద్ది తేడాతో అయిదవ స్థానంలో 3.2 మిలియన్ లతో నాని ఉండగా - 3 మిలియన్ లతో అల్లు అర్జున్ ఉన్నాడు. 2.98 మిలియన్ లతో ఎన్టీఆర్ ఏడవ స్థానంలో ఉన్నాడు.
మరి కొన్ని వారాల్లో నాని అయిదవ స్థానంను - కొన్ని నెలల్లో పవన్ కళ్యాణ్ నాల్గవ స్థానంను కూడా అల్లు అర్జున్ చేరుకునే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఈ ఏడాది వరుసగా మూడు సినిమాలతో బన్నీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అందుకే తప్పకుండా ఆయన టాప్ 5 లో చేరే అవకాశం ఉందని తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా మలయాళం మరియు ఉత్తరాదిన కూడా అల్లు అర్జున్ కు భారీ ఆధరణ ఉంది. అందుకే ఫాలోవర్స్ సంఖ్య భారీగా పెరుగుతూ వస్తోంది.