సల్లూ భాయ్ ని దాటేసిన అల్లు అర్జున్

Update: 2017-06-25 04:39 GMT
రంజాన్ మన దేశంలో పవిత్రమైన పండుగ మాత్రమే కాదు.. సినిమాల పండుగలా కూడా మారిపోయింది. దాదాపు అన్ని ప్రధాన భాషల్లోనూ రంజాన్ వారంలో క్రేజీ మూవీస్ రిలీజ్ అయ్యాయి. వీటిలో ఇప్పటివరకూ ఎక్కువగా అంచనాలున్న మూవీ సల్మాన్ ఖాన్ ట్యూబ్ లైట్ అయితే.. బాక్సాఫీస్ దగ్గర తన దున్నుడుతో అల్లు అర్జున్ సత్తా చాటేశాడు.

విదేశీ మార్కెట్ లోను.. డొమెస్టిక్ మార్కెట్ లోనూ బన్నీ చూపించిన సత్తా అంతా ఇంతా కాదు. యూఎస్ ఏ లో తొలి రోజే దువ్వాడ జగన్నాధం 5,26,355 లక్షల డాలర్లను(ప్రీమియర్స్ తో కలిపి) వసూలు చేసి.. హాఫ్ మిలియన్ మార్క్ ను దాటేసింది. అది కూడా 180+ లొకేషన్స్ లో మాత్రమే. అయితే.. ఇక్కడ 500లకు పైగా స్క్రీన్స్ లో ప్రదర్శితం అవుతున్న ట్యూబ్ లైట్ తొలి రోజు ముగిసేసరికి 2.8 లక్షల డాలర్ల దగ్గర మాత్రమే నిలిచింది. ట్యూబ్ లైట్ తో పోల్చితే సగం కంటే తక్కువ స్క్రీన్స్ లో డీజే ఉన్నా.. రెట్టింపు కంటే ఎక్కువగా వసూళ్లను సాధించిందంటే.. మన సినిమా రేంజ్ అర్ధమవుతుంది.

డొమెస్టిక్ మార్కెట్ లో కూడా సల్మాన్ ఖాన్ మూవీ 20.5 కోట్లను మాత్రమే రాబట్టగలిగింది. కానీ అల్లు అర్జున్ డీజే మాత్రం ఏపీ/తెలంగాణల నుంచే 18.3 కోట్ల షేర్ ను వసూలు చేయగా.. కర్నాటకతో పాటు ఇతర ఏరియాల నుంచి మరో 3 కోట్లు వచ్చాయి. మొత్తం మీద దేశవ్యాప్తంగా క్రేజ్ ఉన్న.. బాహుబలి2ని దాటేస్తాడని అనుకున్న సల్మాన్ మూవీ.. తొలి రోజు వసూళ్ల విషయంలో బన్నీ డీజేను కూడా అందుకోలేకపోయింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News