దుబాయ్‌ లో బన్నీ.. వాట్సప్‌?

Update: 2016-04-04 11:00 GMT
ఈ మధ్యన అల్లు అర్జున్‌ ఎక్కపడితే అక్కడ సర్పరైజింగ్‌ కనిపిస్తూ.. అందరికీ షాకులిస్తున్నాడు. మొన్నటివరకు సరైనోడు షూటింగ్‌ లో ఉన్నప్పుడు అస్సలు బయట ఈవెంట్లకు ఆయన వచ్చిందే తక్కవు. ఆ తరువాత షూటింగ్‌ గ్యాపులో సడన్‌ గా కొన్ని ఈవెంట్స్‌ లో కనిపించి మెరుపులు మెరిశాడు. మొన్న ఒక ఫ్యాన్‌ ఇంటికి వెళ్ళి చరణ్‌ బర్తడే సందర్భంగా కేక్‌ కట్‌ చేశాడు. ఆ తరువాత శ్రీజ పెళ్ళిలో మెరుపులు మెరిపించాడు. ఇప్పుడు తాజాగా మనోడు దుబాయ్‌ లో మెరుస్తున్నాడు. ఒకవేళ సరైనోడు సినిమా ప్రమోషన్లను అక్కడ అప్పుడే మొదలెట్టేశాడా ఏంటి?

అబ్బే లేదండి. ఈరోజు అల్లు అర్జున్‌ కొడుకు అయాన్ పుట్టినరోజు. అయితే ఈ బర్త్  డే ను అందరికీ దూరంగా.. కేవలం తన క్లోజ్ ఫ్రెండ్స్‌ తో కలసి.. ఎక్కడైనా లోన్లీ ప్లేసులో సెలబ్రేట్‌ చేసుకుందాం అని ఫిక్సయ్యాడట. తన భార్య స్నేహారెడ్డితో కలసి.. చక్కగా కొడుకును తీసుకొని తనకు ఇష్టమైన దుబాయ్‌ చెక్కేశాడు. అక్కడైతే కాస్త ఫ్రీగా అటూ ఇటూ తిరిగేయొచ్చు. ఫ్యాన్స్‌ తాకిడీ కూడా పెద్దగా ఉండదు. పైగా బన్నీకి దుబాయ్‌ లో వచ్చే లేటెస్టు ఫ్యాషన్లను కొనాలంటే పిచ్చి. అందుకే ఈరోజు అయాన్‌ బర్తడే అక్కడే సెలబ్రేట్‌ చేసుకుంటున్నాడు.

గతంలో ఇలా దుబాయ్‌ ట్రిప్పుకి వెళ్లి.. సన్నాఫ్‌ సత్యమూర్తి సినిమాకు కావల్సిన కాస్ట్యూములు తెచ్చాడు స్టయిలిష్‌ స్టార్‌. ఇప్పుడు ఏ సినిమాకు తెస్తాడో మరి అదీ చూద్దాం.
Tags:    

Similar News