త్రివిక్రమ్‌ అభిమానులు ఇలా ప్రశ్నిస్తున్నారు!

Update: 2015-04-10 05:00 GMT
గతంలో కంటే ఈ మధ్యకాలంలో ఒక వ్యాది టాలీవుడ్‌ లో బాగా పెరిగిపోయింది. ''సినిమా హిట్‌ అయితే అది హీరో ఖాతాలో వేయడం, ఫెయిల్‌ అయితే దర్శకుడిని నిందించడం'' ఇదే ఆ వ్యాది! ఓ మోస్తరు హీరోకి సంబందించిన ఏ విషయం అయినా ఆ హీరోకి తెలియకుండా దర్శకుడే సొంత నిర్ణయాలు తీసుకుని సినిమా చేసే ఛాన్స్‌ టాలీవుడ్‌ లో చాలా తక్కువ! చిన్న సైజు స్టార్‌ హీరో అయినా చాలు... దర్శకుడు చేసే ప్రతీ ఆలోచన, తీసుకునే ప్రతీ నిర్ణయం ఆ సోకాల్డ్‌ స్టార్‌ హీరోకి తెలియకుండా ఉండే ఛాన్స్‌ లేనే లేదు. నటీనటులు, స్క్రిప్ట్‌, లకేషన్స్‌, పాటలు, సంగీతం... ఇలా ప్రతీ అంశంలోనూ హీరోగారి పాత్ర పుష్కలంగా ఉంటుంది. కథ, స్క్రీన్‌ ప్లే లూ పూర్తిగా తెలుసుకుని బట్టీ పట్టేసే సెట్స్‌ పైకి వెళ్లే హీరోలు కూడా ఉన్నారు! అంటువంటి సినిమాలు ఫెయిల్‌ అయితే మాత్రం హీరోని సైడ్‌ చేసి కేవలం దర్శకుడిపైనే విమర్శలు చేస్తుంటారు.

అత్యంత భారీ అంచనాలతో విడుదలైన '' సన్నాఫ్‌ సత్యమూర్తి '' సినిమా విషయంలో కూడా ఇదే వ్యాది బాగా ప్రభలింది! ఈ సినిమా ఆశించిన అంచనాలను అందుకోలేదనే వార్తలు వస్తున్న నేపథ్యంలో అల్లుఅర్జున్‌ అభిమానులు త్రివిక్రంపై పడ్డారు. అభిమానులైన వారు భావించినంత, ఊహించినంత స్థాయిలో హిట్‌ అవ్వకపోవడంతో అన్నీ తెలిసే రంగంలోకి దిగిన తమ హీరోని సైడ్‌ చేసి... ''త్రివిక్రమ్‌ ప్రయోగంలో బన్నీ బలి అయ్యాడు '' అని కామెంట్స్‌ చేస్తున్నారు!

గతంలో త్రివిక్రమ్‌ - పవన్‌ కల్యాణ్‌ కాంబినేషన్‌ లో వచ్చిన '' అత్తారింటికి దారేది '' రికార్డులను సన్నాఫ్‌ సత్యమూర్తి సినిమా క్రాస్‌ చేయడం ఖాయం అని భావించిన అల్లు అర్జున్‌ అభిమానులు... ఈ సినిమా ఆ స్థాయికి చేరుకోవడం ఏమాత్రం జరిగేపని కాదనే విశ్లేషణలు వస్తున్న నేపథ్యంలో ... సినిమా పై ఆశలు వదిలేసుకుని, తమ హీరోని పొగడే అవకాశం లేకపోవడంతో... త్రివిక్రమ్‌ పై విమర్శలు చేస్తున్నారు. ఇది ఏమాత్రం మంచి పరిణామం కాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు!

ఈ సినిమా అత్తారింటికి దారేది అంత హిట్‌ అవుతుందని త్రివిక్రం చెప్పాడా? లేక బన్నీ భావించాడా? అదీకాక అభిమానులే ఊహించుకున్నారా? వాటిలో జరిగింది మూడోది! కాబట్టి ఊహించుకున్న వారిది తప్పు కానీ... సినిమా హిట్‌ చేయాలని ఆ సినిమాకి ఎంత కష్టపడ్డారో, ఈ సినిమాకి కూడా అదే స్థాయి ఎఫర్ట్‌ పెట్టిన దర్శకుడిని ఎలా బాధ్యులు చేస్తారు? అని త్రివిక్రమ్‌ అభిమానులు ప్రశ్నిస్తున్నారు! సినిమా హిట్‌ అయినా ఫెయిల్‌ అయినా... దర్శకుడికే క్రెడిట్‌ ఇచ్చే రోజులు రావాలని... అప్పుడు దర్శకుడిపై విమర్శలు చేసినా, ప్రశంసలు కురిపించినా అర్థం ఉంది కానీ... ఇలా వన్‌ సైడ్‌ కామెంట్స్‌ చేయడం మంచిది కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు!

Tags:    

Similar News