ఇంతవరకు గ్లామరస్ బాయ్... జులాయి అంటూ కనిపించిన స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ తన రొటీన్ స్టయిల్ పక్కనపెట్టి ఈసారి కొత్తగా ట్రై చేస్తున్నాడు. కుటుంబం కన్నా దేశం ముఖ్యమని నమ్మే ఓ ఆవేశపరుడైన ఆర్మీ ఆఫీసర్ గా వెండి తెరపై కనిపించనున్నాడు. ఇంతకుముందుకు సరైనోడులో ఆర్మీ ఆఫీసర్ గా కనిపించినా ఆ సినిమా కథకు.. ఆర్మీ ఉద్యోగానికి ఎలాంటి లింకు ఉండదు. రైటర్ వక్కంతం వంశీ డైరెక్షన్ లో వస్తున్న నాపేరు సూర్య.. నా ఇల్లు ఇండియా సినిమా మొత్తం ఆర్మీ ఆఫీసర్ గానే కనిపించనున్నాడు.
ఈ సినిమా కోసం అల్లు అర్జున్ గెటప్ మొత్తం మార్చేశాడు. వాస్తవానికి ఆర్మీ అధికారి కావడమంటే ఆషామాషీ ఏమీ కాదు. అందుకోసం కఠోరమైన ట్రైనింగ్ పూర్తి చేయాల్సి ఉంటుంది. సినిమాలో పర్ ఫెక్షన్ కోసం అంత కష్టానికి రెడీ అయిపోయాడు బన్నీ. ప్రస్తుతం ఈ సినిమా కోసం ఎంత శ్రమకోర్చి ఆ పాత్ర చేస్తున్నాడో తాజాగా బయటకొచ్చిన ఫొటోలు చూస్తే అర్ధమవుతుంది. ఇప్పటివరకు బన్నీ చేసిన పాత్రలన్నింటికి పడిన కష్టం ఒకెత్తు అయితే.. ఈ ఒక్క సినిమా కోసం పడుతున్న కష్టం ఒకెత్తు. హీరోలోని ఆవేశాన్నే ఎలివేట్ చేస్తూ డైరెక్టర్ వక్కంతం వంశీ ఈ మూవీ తీస్తున్నాడని ట్రయిలర్ చూస్తే అర్ధమైపోతుంది. మరి అలాంటప్పుడు ఈ పాత్ర కోసం అల్లు అర్జున్ ఇంత కష్టపడాల్సి రావడం కాస్త టూమచ్ గా ఉందనే మాట వినిపిస్తోంది.
సినిమాలో చేసే పాత్రేదయినా దానికి తగ్గట్టు మౌల్డ్ అయిపోవడమే కాదు.. అందుకోసం ఎంత హార్డ్ వర్క్ చేయడానికి రెడీ అయిపోతున్నారు నేటి హీరోలు. అది కష్టమనే దానికన్నా ప్రేక్షకులను మెప్పించడం అనే పాయింట్లోనే ఆలోచిస్తూ ఎంత శ్రమకైనా రెడీ అనే అంటున్నారు. ఆ విషయంలో బన్నీ మిగతావాళ్ల కంటే ఓ అడుగు ముందున్నాడు.. మరి అతడి ఆశలను ఈ సినిమా ఎంతవరకు నిలబెడుతుందో చూడాలి.